రోడ్డు విస్తరణ పేరుతో గోదావరిఖనిలో 46 దారి మైసమ్మ ఆలయాలను కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) అన్నారు. రోడ్డుకు అడ్డుగా ఉన్నాయనే కారణంతో ఆలయాలను కూల్చివేసిన అధికారులు మసీదులను ఎందుకు కూల్చలేదు? అని ప్రశ్నించారు. ఇదే అంశంపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం మున్సిపల్ కమిసనర్అరుణశ్రీకి ఫోన్ చేసి మాట్లాడానన్నారు.
రోడ్డుకు అడ్డుగా ఉన్నాయని కూల్చామని చెప్పిన అధికారులను అదే రోడ్డుకు అడ్డుగా ఉన్న మసీదులు ఎందుకు కూల్చలేదని ప్రశ్నించానన్నారు. ఎవరి మెప్పుకోసం మూకుమ్మడిగా మైసమ్మ ఆలయాలను కూల్చివేశారని నిలదీసినట్లు చెప్పారు. మసీదులను కూల్చివేస్తే వారు దాడికి పూనుకుంటారనే భయంతోనే అధికారులు మసీదుల జోలికి వెళ్లడం లేదని విమర్శించారు.
Read Also: India: అరుదైన అయస్కాంతాల నిల్వలను నిర్మించుకునే దిశగా భారత్ అడుగులు

నిత్యం భక్తులు అమ్మవారిని దర్శించకుంటారు
Bandi Sanjay: ఆటో డ్రైవర్లు తమ ఆటో అడ్డాల దగ్గర ప్రతిరోజు మైసమ్మ ఆలయం వద్ద మొక్కుకుంటారన్నారు. భక్తులు నిత్యం అమ్మవారిని దర్శించుకుంటారన్నారు. అడ్డంగా ఉన్నాయనే నెపంతో ఇష్టమొచ్చినట్లు కూల్చివేస్తారా? భక్తుల మనోభావాలు పట్టవా? పోనీ అదే రోడ్డుకు అడ్డంగా మసీదులు కూడా ఉన్నాయి కదా? మరి వాటినెందుకు కూల్చివేయలేదు? హిందువులంటే అంత చులకనా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. గోదావరిఖని యంత్రాంగానికి 48గంటలు సమయమిస్తున్నానన్నారు.
కూల్చివేసిన దారి మైసమ్మ ఆలయాలన్నింటినీ ఆలోపు పునర్నిర్మించాలన్నారు. లేకపోతే దారికి అడ్డంగా ఉన్న మసీదులన్నింటినీ కూల్చివేయిస్తానని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ అయిన వెంటనే గోదావరిఖని వస్తానన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా అధికారులందరినీ ప్రజల ముందు నిలబబెడతానన్నారు. జరగబోయే పరిణామాలకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని బండి సంజయ్ హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: