Today Rasi Phalalu : రాశి ఫలాలు – 09 నవంబర్ 2025 Horoscope in Telugu – Vaartha Telugu
మేష రాశి
రాజకీయ, పారిశ్రామిక, కళారంగాల్లో ఉన్న వారికి ఈ కాలం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభను గుర్తించే అవకాశాలు ఉన్నా, కొన్ని నిర్ణయాలలో అయోమయం వల్ల జాప్యం సంభవించే అవకాశం ఉంది.
వృషభరాశి
జీవిత భాగస్వామితో చిన్నచిన్న విషయాల్లో తగాదాలు లేదా స్పర్ధలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మాటల్లో మితి పాటిస్తే సంబంధం మరింత బలపడుతుంది. కుటుంబంలో పెద్దల సలహాలను వినడం మంచిది.
…ఇంకా చదవండి
మిథున రాశి
సుదూర ప్రాంత ప్రయాణాలు లేదా విదేశీ ప్రణాళికలకు తాత్కాలిక విరామం ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణాలకు సంబంధించిన అడ్డంకులు, ఆలస్యం, అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు. ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ముందు సమగ్రమైన ప్రణాళిక అవసరం.
…ఇంకా చదవండి
కర్కాటక రాశి
ఈ కాలంలో కర్కాటకరాశివారికి ప్రముఖులతో కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆ పరిచయాలు మీ భవిష్యత్తు ప్రగతికి మార్గం చూపగలవు. సామాజిక వర్గంలో మీ ప్రతిష్ఠ పెరుగుతుంది.
…ఇంకా చదవండి
సింహ రాశి
సింహరాశివారికి ఈ కాలం కొత్త ఆరంభాలకు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామి సలహా, ప్రోత్సాహంతో కొత్త వ్యాపారాలు లేదా ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మద్దతు లభించి మీరు చేపట్టే పనులు విజయవంతంగా సాగుతాయి.
…ఇంకా చదవండి
కన్యా రాశి
ఈ కాలంలో కన్యారాశివారికి ఆప్తుల నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఆ సమాచారం మీ జీవితంలో కొత్త మార్గాలను తెరుస్తుంది. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు పునరుద్ధరించబడే అవకాశం ఉంది.
…ఇంకా చదవండి
తులా రాశి
తులరాశివారికి ఈ కాలం గౌరవం, గుర్తింపు, విజయాలతో నిండిన సమయంగా ఉంటుంది. సంఘంలో మీ గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. మీరు చేసే పనులు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయి.
…ఇంకా చదవండి
వృశ్చిక రాశి
ఈ కాలంలో వృశ్చికరాశివారు ఆకస్మిక ప్రయాణాలకు సిద్ధం కావాల్సి రావచ్చు. అయితే, ఆ ప్రయాణాల్లో కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
…ఇంకా చదవండి
ధనుస్సు రాశి
ధనుస్సురాశివారు ఈ కాలంలో కుటుంబ, స్నేహ సంబంధాలలో కొంత జాగ్రత్త అవసరం. స్వంత మనుషుల మీద వచ్చే ఆరోపణలను ఏకపక్షంగా నమ్మకండి. పరిస్థితిని అర్థం చేసుకుని, రెండు వైపుల మాటలు విని నిర్ణయం తీసుకోవడం మంచిది.
…ఇంకా చదవండి
మకర రాశి
మకరరాశివారికి ఈ కాలం కొంత సవాళ్లతో ప్రారంభమైనా, చివరికి విజయానికే దారి తీస్తుంది. శత్రు వర్గం లేదా మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తుల నుండి పరోక్షంగా కొన్ని చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది.
…ఇంకా చదవండి
కుంభ రాశి
కుంభరాశివారికి ఈ కాలం కార్యదీక్షతో, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడానికి అనుకూలంగా ఉంటుంది. సమయాన్ని వృథా చేయకుండా ప్రతి అంశాన్ని మీకు అనుకూలంగా మార్చుకునే నైపుణ్యం మీలో ఉంటుంది.
…ఇంకా చదవండి
మీన రాశి
మీనరాశివారికి ఈ కాలం ఆర్థికపరంగా సమతుల్యమైనదిగా ఉంటుంది. పాత ఋణాలను తీర్చడంలో కొంత ఇబ్బంది ఉన్నా, కొత్త అప్పులు చేయకుండా జాగ్రత్తపడటం ద్వారా స్థిరత్వాన్ని కాపాడగలుగుతారు.
…ఇంకా చదవండి
వారం – వర్జ్యం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, కార్తీక మాసం(Karthika Masam), దక్షిణాయణం శరద్ ఋతువు, శుక్లపక్షం(Shukla Paksham)