టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) సోషల్ మీడియాలో షేర్ చేసిన తాజా పోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి ఉన్న ఫోటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో, వీరిద్దరి మధ్య ఉన్న సంబంధంపై మరోసారి చర్చ మొదలైంది.
Read Also: K ramp: ఓటీటీలోకి ‘కే ర్యాంప్’.. ఎప్పుడంటే.!

సమంత క్యాప్షన్ చర్చనీయాంశం
సమంత(Samantha) తన పోస్ట్‌లో “స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నాను” అని పేర్కొంది. ఈ ఫోటోకు జతగా ఆమె తన కెరీర్ గురించి సుదీర్ఘమైన నోట్ రాసింది. “గత ఏడాదిన్నరలో నా కెరీర్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాను. రిస్క్ తీసుకుంటూ, నా అంతర్దృష్టిని నమ్మి ముందుకు సాగుతున్నాను. ఈ రోజు చిన్న విజయాలను కూడా జరుపుకుంటున్నాను” అని సమంత తెలిపింది.
వృత్తిపరమైన విజయాలపై దృష్టి
తనతో పనిచేసిన వారిని ప్రశంసిస్తూ, “నేను కలిసి పనిచేసిన వారు ప్రతిభావంతులు, కష్టపడి పనిచేసే నిజాయతీపరులు. వారికి నేను ఎంతో కృతజ్ఞతగా ఉన్నాను. ఇది నా కొత్త ప్రయాణానికి ఆరంభం మాత్రమే” అని సమంత పేర్కొంది.
సమంత, రాజ్ నిడిమోరు మధ్య ఉన్న అనుబంధంపై ఇప్పటికే పలు వదంతులు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, ఈ ఫోటో ఆ చర్చలకు మరింత ఊతమిచ్చింది. అయితే ఆమె పోస్టులో వృత్తి, కృతజ్ఞత, అభివృద్ధి గురించే ప్రస్తావించడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో(social media) విస్తృతంగా షేర్ అవుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: