हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Latest News: Rukmini Vasanth: అభిమానులని హెచ్చ‌రించిన రుక్మిణీ.. ఎందుకంటే?

Anusha
Latest News: Rukmini Vasanth: అభిమానులని హెచ్చ‌రించిన రుక్మిణీ.. ఎందుకంటే?

కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ గా కొన్ని సినిమాల్లో నటించినా, ఆమెకు అసలైన గుర్తింపు తెచ్చిన సినిమా ‘సప్తసాగరాలు దాటి’ (sapta sagaralu dhaati movie). ఆ సినిమాలో ఆమె చూపిన సహజమైన నటన, భావప్రధానమైన ఎమోషన్స్ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. ఆ చిత్రం తర్వాత, ఆమెకు, ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.

Read Also: K ramp: ఓటీటీలోకి ‘కే ర్యాంప్’.. ఎప్పుడంటే.!

తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా ఆమె పేరు వినియోగించి ఒక వ్యక్తి ఇతరులను సంప్రదిస్తూ వారిని దోచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ వ్యక్తి 9445893273 నంబర్ ద్వారా అచ్చం ఆమె లానే మాట్లాడుతుండటంతో అభిమానులు, పరిశ్రమ వ్యక్తులు, బ్రాండ్ ప్రతినిధులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నట్లు ఆమె దృష్టికి వచ్చింది. 

దీనిపై రుక్మిణి (Rukmini Vasanth) స్పందిస్తూ “ఈ నెంబర్ నాది కాదు. ఈ నెంబర్ నుంచి ఫోన్ లేదా మెసేజ్ వస్తే స్పందించవద్దు. నా పేరును ఉపయోగించడం, నకిలీ స్వరంతో ఇతరులను మోసం చేయడం ఒక సీరియస్ సైబర్ నేరం. ఇందులో ఎవరి ప్రమేయమున్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాను. అవసరమైతే పోలీసు కేసులు కూడా నమోదు చేస్తాను” అని క్లియర్ గా తెలిపింది.

 Rukmini Vasanth
 Rukmini Vasanth

టాక్సిక్ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉంది

అలాగే అభిమానులకు, సోషల్ మీడియా (Social media) ఫాలోవర్స్‌కి ఎలాంటి డౌట్ వచ్చినా తనను లేదా తన టీమ్‌ను నేరుగా సంప్రదించాలని, మోసాలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రుక్మిణి చేసిన ఈ బహిరంగ హెచ్చరిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సినిమాల విషయానికి వస్తే, రుక్మిణీ ప్రస్తుతం కన్నడ స్టార్ హీరో యశ్ సరసన నటిస్తున్న ‘ టాక్సిక్’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందుతోంది. యశ్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ‘టాక్సిక్’ సినిమా (‘Toxic’ movie) సాధారణ మాస్ ఎంటర్‌టైనర్ కాదు.

భావోద్వేగాలతో నిండి, రా అండ్ రస్టిక్ స్టైల్లో ఉండే శక్తివంతమైన కథ ఇది. ఈ ప్రాజెక్ట్‌లో భాగమవడం నాకు గర్వకారణం అని రుక్మిణీ తెలిపింది. ప్రస్తుతం రుక్మిణీ కన్నడతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా వరుస ప్రాజెక్టులపై సంతకాలు చేస్తూ సౌత్‌లో అత్యంత క్రేజీ హీరోయిన్‌గా నిలుస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870