టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) తన ప్రత్యేకమైన స్టైల్‌తో యువ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. రొమాంటిక్ కామెడీ జానర్లో తెరకెక్కిన అతని తాజా చిత్రం ‘కే ర్యాంప్’ (K-Ramp) ఇటీవల థియేటర్లలో మంచి విజయం సాధించింది. ఈ సినిమా అక్టోబర్ 18న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాగా, మంచి టాక్ తెచ్చుకుంది.
Read Also: Rashmika Mandanna: విజయ్ తో త్వరలో నా పెళ్లి: రష్మిక
నవంబర్ 15 నుంచి ఆహాలో స్ట్రీమింగ్
ఇప్పటికే థియేటర్లలో రన్ పూర్తి చేసుకున్న ఈ మూవీ, ఇప్పుడు ఓటీటీ వేదికపైకి రాబోతుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా (Aha) ఈ చిత్రాన్ని డిజిటల్ రైట్స్‌తో సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, నవంబర్ 15 నుంచి ఈ సినిమా (K-Ramp) ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా (హీరోయిన్గా) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహించాడు. సాయికుమార్, నరేశ్ వి.కె., కామ్నా జెఠ్మలానీ (Kamna Jethmalani) తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్స్‌పై రాజేశ్ దండా, శివ బొమ్మక్కు ఈ సినిమాను నిర్మించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: