हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Latest News: Steve Waugh: రోహిత్, కోహ్లీల కెరీర్ చివరి దశలో ఉంది: స్టీవ్ వా  

Anusha
Latest News: Steve Waugh: రోహిత్, కోహ్లీల కెరీర్ చివరి దశలో ఉంది: స్టీవ్ వా  

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల భవిష్యత్తుపై ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌లో వీరిద్దరూ కొనసాగుతారా లేదా అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతున్న సమయంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా (Steve Waugh) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఆయన మాట్లాడుతూ, “ఆట కంటే ఏ ఆటగాడూ గొప్ప కాదు” అని చెబుతూ, కెరీర్ చివరి దశలో ఉన్న ఇలాంటి దిగ్గజాల విషయంలో సెలక్షన్ కమిటీ అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించాడు.

Read Also: Hong Kong Sixes 2025: భారత్‌ వరుసగా రెండో ఓటమి

ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టీవ్ వా (Steve Waugh) మాట్లాడుతూ.. “ఆటగాళ్లు కొంత బాధ్యత తీసుకోవాలి. ఆట కంటే తాము గొప్ప అని ఎప్పుడూ అనుకోకూడదు. ఎవరూ శాశ్వతం కాదు. వారి స్థానంలో మరొకరు వస్తారనే వాస్తవాన్ని గ్రహించాలి. ఆటను ఆటగాళ్లు శాసించలేరు.

అంతిమంగా జట్టు ప్రయోజనాల దృష్ట్యా సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌దే తుది నిర్ణయం కావాలి” అని స్పష్టం చేశాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (Virat Kohli, Rohit Sharma) తమ అంతర్జాతీయ కెరీర్ చివరి అంకంలో ఉన్నారు. ఇప్పటికే టీ20, టెస్ట్ ఫార్మాట్ల నుంచి తప్పుకున్న ఈ ఇద్దరూ కేవలం వన్డేలకు మాత్రమే పరిమితమయ్యారు.

Steve Waugh
Steve Waugh

వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ ఒక సెంచరీ

రెండేళ్లలో జరగనున్న 2027 ప్రపంచకప్ (2027 World Cup) నాటికి కోహ్లీకి 39, రోహిత్‌కు 40 ఏళ్లు నిండుతాయి. దీంతో వారి ఫిట్‌నెస్, ఫామ్ చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలవగా, వరుసగా రెండు డకౌట్ల తర్వాత చివరి మ్యాచ్‌లో కోహ్లీ 74 పరుగులతో రాణించాడు.

ఈ నేపథ్యంలో భారత సెలక్టర్లకు స్టీవ్ వా కొన్ని ముఖ్యమైన సూచనలు చేశాడు. “సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఉన్నవారు ఆటగాళ్లతో మరీ సన్నిహితంగా ఉండకూడదు. కొంత దూరం పాటించినప్పుడే కఠినమైన నిర్ణయాలు స్వేచ్ఛగా తీసుకోగలరు. అజిత్ అగార్కర్ (Ajit Agarkar) ఆటగాళ్లతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి. కానీ, అదే సమయంలో అవసరమైన దూరం కూడా పాటించాలి.

కోహ్లీ, రోహిత్ వంటి అనుభవజ్ఞులతో వారి భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడటం చాలా ముఖ్యం. కానీ, జట్టు కోసం ఏది మంచిదో ఆ నిర్ణయం తీసుకునే అధికారం మాత్రం సెలక్టర్‌కే ఉండాలి” అని పేర్కొన్నాడు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870