हिन्दी | Epaper

Telugu News: Eluru: బైక్ దొంగ పోలీసులకు సవాల్‌ – వీడియోతో పట్టుబడ్డ ముఠా

Pooja
Telugu News: Eluru: బైక్ దొంగ పోలీసులకు సవాల్‌ – వీడియోతో పట్టుబడ్డ ముఠా

ఏలూరు(Eluru) జిల్లాలో దొంగతనాలపై పోలీసులు గట్టిగా ముమ్మర చర్యలు చేపట్టారు. తాజాగా బైక్ దొంగతనాల్లో శతకం చేసిన ఓ దొంగ, తనే పోలీసులకు సవాల్‌ విసిరిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయడంతో తనే పట్టుబడ్డాడు. ఆ వీడియో ఆధారంగా పోలీసులు అతనితో పాటు అతని ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు.

read also: Mali: మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు

బైక్‌ చోరీల్లో శతకం చేసిన గణేశ్‌

జిల్లా ఎస్పీ(Eluru) ప్రతాప్‌ శివకిశోర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇటీవల నూజివీడు పరిసర ప్రాంతాల్లో వరుసగా బైక్‌ దొంగతనాలు జరుగుతున్నట్లు గుర్తించారు. దర్యాప్తులో దులాయ్‌ గణేశ్‌ అలియాస్‌ నాగపవన్‌ అనే యువకుడు నిందితుడిగా తేలాడు. అతడు తన స్నేహితులకు “బైక్‌ చోరీల్లో సెంచరీ చేశా, పోలీసులు నన్ను ఏం చేయలేరు” అంటూ వీడియో పంపాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు అతడిని గుర్తించారు.

https://twitter.com/SpEluruDistrict/status/1986814735220887573?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1986814735220887573%7Ctwgr%5Eb0e031aa8c6a2f70bb92decd406525f38829705e%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Frtvlive.com%2Fcrime%2Fa-thief-attested-who-challenged-to-police-in-eluru-10638196

ఐదుగురు సభ్యులతో కూడిన ముఠా అరెస్ట్‌

పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఐదుగురు దొంగలను పట్టుకున్నారు. అరెస్టైనవారు:

  • దులాయ్‌ గణేశ్‌ (రెల్లిపేట, నూజివీడు)
  • షేక్‌ మెహర్‌బాబా (గాంధీబొమ్మ కూడలి)
  • షేక్‌ ఆసిఫుల్లా (ఎంఆర్‌ అప్పారావు కాలనీ)
  • చిత్తూరి అజయ్‌కుమార్
  • చౌటపల్లి సుభాష్‌ (గొల్లపల్లి)

12 బైకులు స్వాధీనం – మద్యం మత్తులో చేసిన వీడియో

పోలీసులు ఈ ముఠా వద్ద నుంచి 12 బైకులు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాల వెనుక ఉన్న కారణం వ్యసనాలు, ఈజీ మనీ కోరిక అని దర్యాప్తులో తెలిసింది. విచారణ సమయంలో గణేశ్‌ తన వీడియో గురించి అడగగా, “మద్యం మత్తులో(Alcohol intoxication) అలా మాట్లాడాను” అని చెప్పాడు. ఎస్పీ ప్రతాప్‌ శివకిశోర్‌ గణేశ్‌ను కఠినంగా హెచ్చరిస్తూ, “మళ్లీ పోలీసులకు ఛాలెంజ్‌ చేస్తావా?” అంటూ ఫైర్‌ అయ్యారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించి, అతడి మీద ఉన్న పాత కేసులపై కూడా విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అల్లు ఫ్యామిలీ వేడుకలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే

అల్లు ఫ్యామిలీ వేడుకలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే

రైసినా డైలాగ్‌లో చంద్రబాబు స్పీచ్, అమరావతి విజన్ ఏంటి?

రైసినా డైలాగ్‌లో చంద్రబాబు స్పీచ్, అమరావతి విజన్ ఏంటి?

వైసీపీపై మరోసారి విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్

వైసీపీపై మరోసారి విమర్శలు గుప్పించిన పవన్ కళ్యాణ్

కల్తీ పాల ఘటన: ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజాలు

కల్తీ పాల ఘటన: ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజాలు

అమరావతిలో క్రియేటివ్ సిటీ, చంద్రబాబు కొత్త ప్లాన్ ఏంటి?

అమరావతిలో క్రియేటివ్ సిటీ, చంద్రబాబు కొత్త ప్లాన్ ఏంటి?

ఏపీ పోలీసులపై తెలంగాణ వ్యక్తి కాల్పులకు యత్నం

ఏపీ పోలీసులపై తెలంగాణ వ్యక్తి కాల్పులకు యత్నం

మద్య నిషేధం హామీ వెనుక నిజం? జగన్‌పై లోకేశ్ ఆరోపణలు

మద్య నిషేధం హామీ వెనుక నిజం? జగన్‌పై లోకేశ్ ఆరోపణలు

రైలు ఢీకొని విద్యార్థిని మృతి

రైలు ఢీకొని విద్యార్థిని మృతి

లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు కుట్రపూరిత ఆరోపణలు.. సజ్జల

లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు కుట్రపూరిత ఆరోపణలు.. సజ్జల

78 ఏళ్ల వయసులో 12 బంగారు పతకాలతో రికార్డు సృష్టించిన రామసుబ్బమ్మ!

78 ఏళ్ల వయసులో 12 బంగారు పతకాలతో రికార్డు సృష్టించిన రామసుబ్బమ్మ!

కల్తీ పాల ఘటనలో మరొకరు బలి 10కి చేరిన మరణాలు

కల్తీ పాల ఘటనలో మరొకరు బలి 10కి చేరిన మరణాలు

అక్రమ మద్యం పై మంత్రి  లోకేశ్ విమర్శలు

అక్రమ మద్యం పై మంత్రి  లోకేశ్ విమర్శలు

📢 For Advertisement Booking: 98481 12870