ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రయాణికుల సౌకర్యార్థం మరో కొత్త సాంకేతిక విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై ప్రజలు బస్ టికెట్ బుకింగ్ కోసం APSRTC వెబ్‌సైట్ (APSRTC Website) లేదా యాప్‌లోకి ప్రత్యేకంగా వెళ్లాల్సిన అవసరం లేదు. గూగుల్ మ్యాప్స్ (Google Maps) లోనే గమ్యస్థానం సెర్చ్ చేస్తే ఆ రూట్‌లో తిరిగే (APSRTC) రిజర్వేషన్ సదుపాయం కలిగిన బస్సులు, బయలుదేరే సమయం, ప్రయాణ సమయం వంటి వివరాలన్నీ ప్రత్యక్షంగా కనిపిస్తాయి.
Read Also: AP: దేవాలయాల్లో సాంకేతిక సదుపాయాలు.. 100 కియోస్క్‌ల ఏర్పాటు
గూగుల్ ప్రతినిధులతో చర్చలు పూర్తయ్యాయి
ఉదాహరణకు, మీరు “Vijayawada to Hyderabad” అని గూగుల్ మ్యాప్స్‌లో సెర్చ్ చేస్తే, ఆ మార్గంలో తిరిగే APSRTC బస్సులు, బయలుదేరే సమయాలు, టికెట్ లభ్యత వివరాలు ఆటోమేటిక్‌గా ప్రదర్శించబడతాయి.
వాటి మీద క్లిక్ చేస్తే APSRTC వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్తుంది.అక్కడ నుంచి టికెట్ బుకింగ్ పూర్తి చేయవచ్చు.ఈ మేరకు గూగుల్ ప్రతినిధులతో చర్చలు పూర్తయ్యాయి. VJA-HYD మార్గంలో అమలుచేయగా విజయవంతమైంది. త్వరలో అన్ని రూట్లలో మొదలుకానుంది.

రోజువారీగా వేలాది బస్సులను నడుపుతోంది
ప్రస్తుతం APSRTC రోజువారీగా వేలాది బస్సులను నడుపుతోంది. దీర్ఘదూర, పట్టణ, గ్రామీణ సర్వీసుల్లో టికెట్ బుకింగ్ వ్యవస్థను మరింత సులభతరం చేయడమే ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం. గూగుల్ మ్యాప్స్ సహకారంతో ప్రయాణికులకు సమయానుసారం బస్సు వివరాలు,
మార్గాలు, మధ్య స్టాప్‌లు, రియల్ టైమ్ ట్రావెల్ అప్‌డేట్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.ఇక ఈ కొత్త ఫీచర్ వల్ల ప్రయాణికులు బస్సు సమయాలు లేదా లభ్యత కోసం RTC కౌంటర్ల వద్ద నిలబడాల్సిన అవసరం ఉండదు.దీని వల్ల సులభంగా లభిస్తుంది. దీంతో సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయి.గూగుల్ మ్యాప్స్ ద్వారా బుకింగ్ సదుపాయం అందించడం మరో ముందడుగు.
గూగుల్ మ్యాప్ సరికొత్త ఫీచర్స్‌ను జోడించనుంది
గూగుల్ మ్యాప్ సరికొత్త ఫీచర్స్‌ను జోడించనుంది. ఏఐ ఫీచర్ (AI feature) సహాయంతో గూగుల్ మ్యాప్‌ను అప్‌డేట్ చేసిన విషయం తెలిసిందే. గూగుల్ మ్యాప్స్‌లో ఇటీవల చేర్చిన సరికొత్త ఫీచర్‌లలో AI-ఆధారిత నావిగేషన్, EV ఛార్జింగ్ స్టేషన్ల సమాచారం,
మెరుగైన ట్రాఫిక్ అలెర్ట్‌లు, స్థానిక నిపుణుల సిఫార్సులు వీక్షణ వంటివి ఉన్నాయి. ఈ ఫీచర్‌లు యూజర్ అనుభవాన్ని మెరుగుపరచడం వినియోగదారులకు మరింత సులభంగా ప్రయాణించడానికి సహాయపడతాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: