తెలుగు రాష్ట్రాల వాహనాలకు ఏమైంది? నిత్యం ఎక్కడో ఒకచోట రోడ్డు ప్రమాదాలు(Accident) జరుగుతున్నాయి. రోజుకు కనీసం రెండుమూడు ప్రమాదాలు జరుగుతుండడం విచారకరం. తాజాగా వరంగల్(Warangal)-హైదరాబాద్ ప్రధాన రహదారిపై, ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔషాపూర్ వద్ద, కారును ఓవర్ టేక్ చేసేందుకు ఓ ఆర్టిసీ బస్సుముందుకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు వేగంగా వస్తూ డివైడర్ను ఢీకొట్టింది. పక్కనే ఉన్న రైలింగ్ ను ఢీకొట్టి బస్సు ఆగిపోయింది.దీంతో ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు.
బస్సు వేగంగా ప్రయాణించడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లుగా తెలుస్తున్నది. ఇందులోని ప్రయాణీకులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతీ ఊపిరిపీల్చుకుని.
Read Also: Poverty: జీవిత పాఠాలను నేర్పుతున్న పేదరికం

నిత్యం ప్రమాదాలతో పరేషాన్
గత నెలలో కర్నూలు కావేరీ(Kurnool kaveri) బస్సు దగ్ధం ప్రమాదంలో 19మంది మరణించారు. గత సోమవారం చేవేళ్ల వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ప్రమాదంలో 24 మంది దుర్మణం చెందిన విషయం తెలిసిందే. కావేరీ ప్రైవేట్ వాహనం మంటల్లో కాలిపోవడం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా రెండు తెలుగురాష్ట్రాల్లో ప్రయాణీకులు ఆర్టీసీ బస్సులను ఆశ్రయించేసంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది.
ఇప్పుడు ఆర్టీసీ బస్సుల్లో సైతం ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రయాణం చేయాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. సొంతవాహనాల్లో వెళ్లినా ప్రాణాలకు భరోసా ఉండడం లేదని, ఈ ప్రమాదాల నివారణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: