హైదరాబాద్(Hyderabad) క్రీడాభిమానులకు మరో శుభవార్త. నగరంలో మరో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం త్వరలో రూపుదిద్దుకోనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తాజా ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్ట్‌ను ఫ్యూచర్ సిటీలో నిర్మించేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. అధికారుల సమాచారం ప్రకారం, ఈ స్టేడియాన్ని రెండు సంవత్సరాల్లో పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. కొత్త స్టేడియం రూపకల్పనలో లండన్ లార్డ్స్, ఆస్ట్రేలియా సిడ్నీ, మెల్‌బోర్న్ వంటి ప్రసిద్ధ మైదానాల ఆర్కిటెక్చర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నారు.
Read also:Gujarat: ప్రాణాలు తీసిన బ్లాంకెట్

ఈ ప్రాజెక్ట్ లక్ష్యం కేవలం క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం మాత్రమే కాకుండా, ప్రపంచ స్థాయి క్రీడా, సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయడం కూడా. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఇది హైదరాబాద్కు(Hyderabad) మరో ప్రౌడిని తెచ్చిపెడుతుందనే అంచనాలు ఉన్నాయి.
విదేశీ అధ్యయనం – మాజీ క్రికెటర్ల బృందం ముందుకు
కొత్త స్టేడియం నిర్మాణంపై పూర్తి అధ్యయనం చేయడానికి ప్రభుత్వం మాజీ భారత క్రికెటర్లతో కూడిన బృందాన్ని విదేశాలకు పంపాలని నిర్ణయించింది. వీరు లార్డ్స్, మెల్‌బోర్న్, సిడ్నీ వంటి ప్రతిష్టాత్మక స్టేడియాలను సందర్శించి, అవి ఎలా నిర్వహించబడుతున్నాయో, డిజైన్ మరియు ఫెసిలిటీల పరంగా ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నాయో పరిశీలించనున్నారు. ఈ బృందం సిఫార్సుల ఆధారంగా స్టేడియం రూపకల్పన, సీటింగ్ కెపాసిటీ, సదుపాయాలు, రవాణా వ్యవస్థ వంటి అంశాలను తుది నిర్ణయం తీసుకోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధునిక క్రీడా వేదికలతో సమానమైన మౌలిక వసతులు కల్పించాలని స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
కందుకూరులో స్థలం ఖరారు అయ్యే అవకాశం
రవాణా సౌకర్యాలు, భౌగోళిక పరిస్థితులు, భూమి లభ్యత వంటి అంశాలను పరిశీలించి, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో స్టేడియం ఏర్పాటు చేసే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్ (ORR) సమీపంలో ఉండటం వల్ల నగరంలోని అన్ని ప్రాంతాల నుండి సులభంగా చేరుకోవచ్చు. కందుకూరు ప్రాంతం ఫ్యూచర్ సిటీలో భాగంగా అభివృద్ధి చెందుతున్నందున, కొత్త స్టేడియం అక్కడ ఏర్పాటు అయితే ఆర్థిక, క్రీడా రంగాల్లో వేగవంతమైన వృద్ధికి దోహదం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
కొత్త క్రికెట్ స్టేడియం ఎక్కడ నిర్మించనున్నారు?
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో నిర్మించే అవకాశముంది.
స్టేడియం ఎప్పుడు పూర్తవుతుంది?
రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: