తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు(Bus Accident) ప్రజల్లో భయాందోళనలు రేపుతున్నాయి. తాజాగా వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిపై మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. జనగామ డిపోకు చెందిన ఆర్టీసీ(RTC) బస్సు 38 మంది ప్రయాణికులతో ఉప్పల్ వైపు వస్తుండగా ఔశాపూర్ వద్ద ఓవర్‌టేక్ ప్రయత్నం ప్రమాదానికి దారి తీసింది. సాక్షుల సమాచారం ప్రకారం, ముందున్న కారును డ్రైవర్ ఓవర్‌టేక్ చేయబోయే క్రమంలో బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలి రహదారిపైకి దూసుకెళ్లింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తక్షణమే సహాయక చర్యలు ప్రారంభించారు. అదృష్టవశాత్తు ఎవరూ ప్రాణాపాయం పాలుకాకపోవడం ఊరటనిచ్చింది.
Read Also: VIDEO VIRAL: బంగారం దోచుకోబోయి దెబ్బలు కొట్టించుకున్న మహిళ

38 మంది ప్రయాణికులు సురక్షితం
ఘటన సమయంలో బస్సులో(Bus Accident) ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బస్సు దెబ్బతినడంతో రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు క్రేన్ సహాయంతో బస్సును రహదారి పక్కకు తరలించారు. ఈ ప్రమాదంపై ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలి కాలంలో ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు వరుసగా ప్రమాదాలకు గురవుతుండటంతో ప్రజలు భద్రతా ప్రమాణాలపై ప్రశ్నిస్తున్నారు. డ్రైవర్‌ల నిర్లక్ష్యం, ఓవర్‌టేక్ ప్రయత్నాలు, వేగం వంటి అంశాలు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అధికారులు బస్సు డ్రైవర్‌లకు జాగ్రత్తగా నడపాలని, ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టే నిర్లక్ష్య చర్యలు చేయవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అదే సమయంలో వాహనాల సాంకేతిక తనిఖీలను క్రమం తప్పకుండా నిర్వహించాలని రవాణా శాఖకు సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: