తెలంగాణ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి(M. Kodanda Reddy) రైతుల పట్ల తన అపారమైన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. యాచారంలో తనకున్న సుమారు రూ.4 కోట్ల విలువైన 2,000 గజాల స్థలాన్ని ప్రభుత్వానికి దానం చేశారు. రైతులు తమ పంటలను నిల్వ చేయడానికి, వ్యవసాయ పరికరాలను భద్రపరచడానికి ఈ భూమి ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
Read Also: TG: జగదీశ్, సంజయ్ నేడు స్పీకర్ విచారణకు హాజరు

గురువారం నాడు కోదండరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి భూమికి సంబంధించిన గిఫ్ట్ డీడ్ పత్రాలను వ్యవసాయ శాఖ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “యాచారం మండలంలోని రైతుల కోసం ఈ స్థలాన్ని ఉపయోగించాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి(Telangana Govt) బహూకరిస్తున్నాను” అని అన్నారు. ఈ భూమి రిజిస్ట్రేషన్ ఇబ్రహీంపట్నం సబ్‌రిజిస్టార్ కార్యాలయంలో పూర్తయింది.
రైతుల పట్ల ఆరాధనకు ప్రతీకగా కోదండరెడ్డి నిర్ణయం
కోదండరెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా(Telangana Govt) ప్రశంసలు అందుకుంటోంది. ఆయన చేసిన ఈ విరాళం రైతులకు ఉపయోగపడేలా వినియోగించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఈ నిర్ణయం గురించి ముందుగానే తెలియజేశారని కోదండరెడ్డి వెల్లడించారు.
అంతేకాదు, ఇటీవల హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కూడా ఓ వృద్ధుడు తన కొడుకుతో విసిగిపోయి రూ.3 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వానికి అప్పగించిన ఘటన వెలుగు చూసింది. ఇలాంటి సంఘటనలతో పాటు కోదండరెడ్డి చర్య సామాజిక చైతన్యానికి దారితీస్తోందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: