Modi: భారత జాతీయ గీతం “వందేమాతరం” (vande mataram) 150వ వార్షికోత్సవ వేడుకలను ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వందేమాతరం స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్‌ను ఆవిష్కరించారు. వందేమాతరం కేవలం ఒక పదం కాదని, అది తరతరాలుగా భారతీయులలో స్ఫూర్తి నింపే మంత్రమని ప్రధాని అన్నారు. ఈ గీతం మన దేశ ఆత్మవిశ్వాసాన్ని పెంచి, మన చరిత్రతో మనల్ని అనుసంధానిస్తుందని పేర్కొన్నారు. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు ఆయన నివాళులర్పించారు. కేంద్ర సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, వందేమాతరం స్వాతంత్ర్య సమరయోధుల చివరి నినాదమైందని, అది భారతీయులను ఏకం చేసే శక్తి అని అన్నారు.
Read also: SBI: 100 బిలియన్ డాలర్ల కంపెనీగా ఎస్ బిఐ

Modi: వందేమాతరం ఒక మంత్రం: ప్రధాని మోదీ
బంకించంద్ర ఛటర్జీ రచించిన
Modi: ప్రజలు తమ గళంతో వందేమాతరం పాడి పంపేందుకు డిజిటల్ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో సామూహికంగా వందేమాతరం ఆలపించారు. 1875 నవంబర్ 7న బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం మొదటగా ఆయన రచించిన “ఆనందమఠం” నవలలో భాగమైంది. ఈ గీతం స్వదేశీ ఉద్యమానికి నినాదంగా మారి జాతీయ చైతన్యానికి ప్రతీకగా నిలిచింది. 2026 నవంబర్ 7 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: