తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఐటీ (IT) రంగంలో శిక్షణ ఇవ్వడానికి(Jobs) పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలో మొత్తం 2,837 కంప్యూటర్ టీచర్లను (ICT Instructors) నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సర్కారు నిర్ణయం ప్రకారం ఐదు లేదా అంతకంటే ఎక్కువ కంప్యూటర్లున్న పాఠశాలల్లో ఈ ఐటీ ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు. విద్యార్థులు టెక్నాలజీ ప్రాతిపదికన నేర్చుకునేలా, కంప్యూటర్ విద్యను(Jobs) మరింత విస్తృతం చేసే లక్ష్యంతో ఈ చర్య తీసుకుంటున్నారు.
Read Also: NEET-SS: సూపర్ స్పెషాలిటీ కోర్సులకు NEET-SS 2025 దరఖాస్తులు ప్రారంభం

ఔట్‌సోర్సింగ్ విధానంలో నియామకాలు
ఈ నియామకాలను ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన నిర్వహించనున్నారు. నియమించబడే ప్రతి ఇన్‌స్ట్రక్టర్‌కు నెలకు రూ.15,000 గౌరవ వేతనం చెల్లించనున్నారు. దీనికి సంబంధించిన ఫైల్‌ను ఇప్పటికే ముఖ్యమంత్రికి పంపగా, ఆయన ఆమోదం అనంతరం అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది.
డిజిటల్ ఎడ్యుకేషన్‌లో కీలక ముందడుగు
ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థులు సమానంగా కంప్యూటర్ జ్ఞానం పొందే అవకాశం లభిస్తుంది. భవిష్యత్‌లో విద్యార్థులు ఐటీ రంగంలో కెరీర్‌ను కొనసాగించేందుకు ఇది బలమైన పునాదిగా నిలవనుంది.
Read hindi news :hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also :