బీహార్ అసెంబ్లీ ఎన్నికల(Bihar Election) తొలి విడత పోలింగ్ ముగిసింది. ఓటర్లు ఊహించని రీతిలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి, రాష్ట్ర ఎన్నికల చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించారు. నిన్న జరిగిన తొలి దశ పోలింగ్‌లో ఏకంగా 64.66 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. దాదాపు 74 ఏళ్ల తర్వాత బీహార్‌లో నమోదైన అత్యధిక పోలింగ్ శాతం ఇదే కావడం గమనార్హం. 1951లో జరిగిన ఎన్నికల తర్వాత ఇంతటి భారీస్థాయిలో ఓటింగ్ జరగడం ఇదే ప్రథమం.
Read Also: Hyderabad Drugs Case: ఓవర్‌డోస్‌తో యువకుడి మృతి .. రాజేంద్రనగర్‌లో విషాద ఘటన

పోలింగ్ శాతంపై ప్రశాంత్ కిషోర్ స్పందన
ఈ రికార్డు స్థాయి పోలింగ్‌పై జన్ సూరజ్ పార్టీ అధినేత, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) స్పందించారు. బీహార్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తాను కొన్ని నెలలుగా చెబుతున్న మాటే నిజమైందని ఆయన అన్నారు. రాష్ట్రంలో 60 శాతానికి పైగా ప్రజలు మార్పును ఆశిస్తున్నారని, వారికి జన్ సూరజ్ పార్టీ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా నిలిచిందని పేర్కొన్నారు. ఛఠ్ పండుగ కూడా పోలింగ్ పెరగడానికి ఒక కారణమని, నవంబర్ 14న ఫలితాల రోజున తమ పార్టీ చరిత్ర సృష్టించబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
తొలి విడత వివరాలు, తదుపరి పోలింగ్
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా, రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలి విడతలో భాగంగా గురువారం 121 స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 2020 ఎన్నికల్లో 57.29 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈసారి తొలి విడతలోనే ఆ రికార్డు బద్దలైంది. మిగిలిన 122 స్థానాలకు రెండో విడత పోలింగ్ మంగళవారం జరగనుంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఊహించని రీతిలో పెరిగిన ఈ ఓటింగ్ శాతం ఇప్పుడు అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ రేపుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: