అప్పీల్ను తోసిపుచ్చిన కోర్టు కర్ణాటక హైకోర్టులో(Karnataka) సిద్ధరామయ్య(Siddaramaiah) సర్కారుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ సంస్థలో ప్రైవేట్ సంస్థల కార్యాకలాపాలను పరిమితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై గతంలో హైకోర్టు ధార్వాడ్ సింగిల్ జడ్జి బెంచ్ స్టే ఇచ్చింది. సింగిల్ జడ్జి నిర్ణయాన్ని ప్రభుత్వం సవాల్ చేసింది. స్టే విషయంలో అదే బెంచ్ కు వెళ్లాలని న్యాయమూర్తులు ఎస్ జీ పండిట్, గీతా కేబీలతో కూడిన డివిజన్ బెంచ్ ప్రభుత్వాన్ని సూచించింది. అయితే, సిద్ధరామయ్య ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ పాంగణాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని.. నిర్వహించే ముందు ప్రైవేటు సంస్థలు పరిపాలనా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.
Read also: తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: ఛైర్మన్

ఆర్ ఎస్ ఎస్ లక్ష్యంగా ఉత్తర్వులు
నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా కార్యక్రమం, ఊరేగింపు భారత జాతీయ చట్టం నిబంధనల ప్రకారం చట్టవిరుద్ధమని పేరొకింది. ఈ ఉత్తర్వులు ఆర్ ఎస్ ఎస్ లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఆర్ ఎస్ ఎస్ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ.. ఉత్తర్వుల్లోని నిబంధనలు ఆర్ ఎస్ ఎస్ కార్యకలాపాలు, మార్చ్ పై ప్రభావం చూపే ఉద్దేశంతో ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ఈ ఉత్తర్వులను పునస్బైతన్య సేవా సమస్త అనే సంస్థ ధార్వాడ్ హైకోర్టు బెంచ్ లో సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన సింగిల్ బెంచ్ జడ్జి ప్రభుత్వ ఉత్తర్వులపై మధ్యంతర స్టే ఇచ్చింది. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పై విచారణ సందర్భంగా ప్రజలంతా కలిసి కవాతు చేయాలనుకుంటే ఆన్ని ఆపొచ్చా? అంటూ బెంచ్ ప్రశ్నించింది. అంతేకాక ప్రభుత్వం అప్పీల్ ను ధర్మాసనం తోసిపుచ్చింది. దిసభ్య ధర్మాసనం అప్పీల్ దాఖలు చేసేందుకు సింగిల్ జడ్జి న్యాయమూర్తిని ఆశ్రయించాలని కోర్టు సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: