Arundhati Reddy: భారత మహిళల క్రికెట్ జట్టు పేసర్ అరుంధతి రెడ్డి, (Arundhati reddy) ప్రపంచకప్ విజేత జట్టుతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసింది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రధానిని ఉద్దేశించి అరుంధతి, “మీతో మాట్లాడే అవకాశం వస్తుందని నేను ఊహించలేదు. మా అమ్మ తరఫున ఒక సందేశం చెప్పాలనుకుంటున్నాను ఆమెకు మీరు హీరో అట” అని చెప్పింది.
Read also: Team India: టీం ఇండియా మహిళా జట్టుని ప్రశంసలతో ముంచెత్తిన మోదీ
Arundhati Reddy: మా అమ్మకు మీరే హీరో మోది జీ సార్
Arundhati Reddy: ఆ మాటలు విన్న ప్రధాని చిరునవ్వుతో స్పందించగా, అరుంధతి మరో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. “మా అమ్మ ఈ విషయం చెప్పమని నన్ను నాలుగైదు సార్లు ఫోన్ చేసింది. ‘నా హీరోని ఎప్పుడు కలుస్తావు?’ అని పదేపదే అడిగింది” అని తెలిపింది. ఆమె మాటలు అక్కడున్న వారిలో చిరునవ్వులు పూయించాయి. 28 ఏళ్ల అరుంధతి రెడ్డి, ఇటీవల ముగిసిన మహిళల ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులో కీలక సభ్యురాలిగా నిలిచింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: