Rain alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు మరోసారి మారుతున్నాయి. నైరుతి బంగాళాఖాతం (Bau of bengal) నుంచి ఉత్తర కేరళ వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ ద్రోణి ప్రభావం కారణంగా గురువారం రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Read also: Weather Update: తెలంగాణ, ఏపీలో వర్షాల హెచ్చరిక

Rain alert: నేడు ఏపీకి వర్ష సూచన..
Rain alert: ప్రస్తుత పరిస్థితుల్లో కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. నిన్న సాయంత్రం వరకు ప్రకాశం జిల్లా బి.చెర్లపల్లిలో 65.2 మి.మీ., శ్రీసత్యసాయి జిల్లా గండ్లపెంటలో 45 మి.మీ., నెల్లూరు జిల్లా రాపూర్‌లో 40.5 మి.మీ., విజయవాడ తూర్పు ప్రాంతంలో 39 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు విపత్తుల శాఖ వివరించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: