బిహార్లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Elections 2025) సమరానికి నేడు అధికారికంగా శ్రీకారం చుట్టబడింది. గురువారం ఉదయం 7 గంటలకు మొదటి విడత పోలింగ్ ప్రారంభమైంది.నేడు బిహార్‌లోని 18 జిల్లాల పరిధిలో ఉన్న మొత్తం 121 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత పోలింగ్‌లో మొత్తం 1,314 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
Read Also: Bihar Elections : నేడు బిహార్లో తొలి దశ ఎన్నికలు
ఈ 121 నియోజవర్గాల్లోని సుమారు 3.75 కోట్ల మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా మొత్తం 45,341 పోలింగ్‌కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిల్లో అధిక భాగం పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. తొలి విడత పోలింగ్‌లో మొత్తం 10 లక్షలకు పైగా కొత్త ఓటర్లు తమ ఓహు హక్కును వినియోగించుకోబోతున్నారు.
తొలి విడత పోలింగ్‌లో భాగంగా.. జేడీయూ 57 స్థానాలు, బీజేపీ 48, ఆర్‌జేడీ 73, కాంగ్రెస్ 24, ఎల్‌జేపీ 14, ఆర్‌ఎల్‌ఎం 2, సీపీఐ-ఎంఎల్ 14 చోట్ల పోటీకి నిలిచాయి. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్‌సురాజ్ పార్టీ నుంచి 119 మంది పోటీ చేస్తున్నారు. తొలి విడతలో ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి,
హ్యాట్రిక్ కొట్టే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు
ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌తోపాటు బీజేపీ కీలక నేత సామ్రాట్ చౌధరి, 14 మంది మంత్రులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు.తేజస్వీ యాదవ్ (Tejaswi Yadav) రాఘోపుర్ నియోజకవర్గం నుంచి మూడో సారి విజయం సాధించి..

హ్యాట్రిక్ కొట్టే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇక రెండుసార్లు మండలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సామ్రాట్ చౌధరీ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో పోటీకి సిద్ధమయ్యారు. బిహార్ (Bihar Elections 2025) లో మొత్తం 243 శాసనసభ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 6, 11వ తేదీల్లో పోలింగ్ నిర్వహించనుండగా.. నవంబర్ 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ప్రధాని నరేంద్ర మోదీ కీలక సందేశం
బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Elections 2025) తొలి విడత పోలింగ్ వేళ ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) కీలక సందేశం ఇచ్చారు. బిహార్ ఓటర్లు ప్రతి ఒక్కరూ.. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో తొలిసారి ఓటు హక్కు వచ్చిన యువత ముందుగా పోలింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాతే రిఫ్రెష్ అవ్వాలి (పెహలే మత్‌దాన్, ఫిర్ జల్‌పాన్) అంటూ ప్రధాని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: