బాలీవుడ్ ప్రముఖ నటి సోనాక్షి సిన్హా(Sonakshi Sinha) తన ‘జటాధర'(Jatadhara) చిత్ర ప్రమోషన్లలో భాగంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమల పనివిధానాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది పరిశ్రమలో ఉండే సమయపాలన, క్రమశిక్షణను ఆమె ప్రశంసించగా, ఈ విషయంలో బాలీవుడ్ చాలా నేర్చుకోవాలని సూచించారు.
Read Also: Telangana: విద్యా రంగం పతనం – కాంగ్రెస్‌పై బండి సంజయ్ విమర్శలు

హిందీ పరిశ్రమలో పద్ధతి నచ్చదు: సోనాక్షి
ఓ ఇంటర్వ్యూలో సోనాక్షి సిన్హా మాట్లాడుతూ, “నేను గతంలో తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేశాను. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. దక్షిణాది సినీ పరిశ్రమలో కొన్ని విషయాలు నాకు బాగా నచ్చాయి, ముఖ్యంగా ఇక్కడి సమయపాలన అద్భుతం” అని అన్నారు. టాలీవుడ్‌లో ఉదయం 9 గంటలకు షూటింగ్ మొదలైతే సాయంత్రం 6 గంటల కల్లా కచ్చితంగా పూర్తిచేస్తారని, దీనికి ఎంతో క్రమశిక్షణ అవసరమని తెలిపారు. దీనికి భిన్నంగా, “హిందీ పరిశ్రమలో ఇలాంటి వాతావరణం ఉండదు. అక్కడ సమయపాలన పాటించరు, అర్ధరాత్రి వరకు షూటింగ్‌లు జరుగుతూనే ఉంటాయి. ఆ పద్ధతి నాకు అస్సలు నచ్చదు,” అని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంలో టాలీవుడ్‌ను చూసి హిందీ వాళ్లు మారాలని ఆమె కోరుకున్నారు.
‘జటాధర’ సినిమా వివరాలు
సోనాక్షి సిన్హా నటిస్తున్న ఈ చిత్రం నవ దళపతి సుధీర్ బాబు(Sudheer Babu) హీరోగా తెరకెక్కుతోంది. పాన్-ఇండియా ద్విభాషా చిత్రంగా రూపొందిన ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఈ చిత్రాన్ని ఉమేశ్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్ వంటివారు నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో విడుదల కానుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: