బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య వ్యక్తిగత దూషణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఎన్డీయే కూటమి తరఫున ప్రచారం చేస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ,(Rahul Gandhi) సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌లపై తీవ్ర విమర్శలు చేశారు.
Read Also: Hyd Crime:మాజీ భార్య పన్నాగంతో భర్త కిడ్నాప్ – రూ.22 కోట్ల స్థల వివాదం

‘అప్పు, పప్పు, తప్పు’: యోగి ఎద్దేవా
ముజఫరాపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో యోగి ఆదిత్యనాథ్ ఈ ముగ్గురిని ఎద్దేవా చేస్తూ వారిని ‘అప్పు, పప్పు, తప్పు’ (తేజస్వి, రాహుల్, అఖిలేశ్(Akhilesh) లను ఉద్దేశించి) అంటూ సంబోధించారు. గాంధీజీ చెప్పిన మూడు కోతులు చెడు మాట్లాడొద్దని, చెడు వినొద్దని, చెడు చూడొద్దని చెబుతాయని, కానీ బీహార్‌లో ఉన్న ఈ మూడు కోతులు మాత్రం రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు చెబుతూ మభ్యపెట్టి తిరిగి ‘జంగిల్ రాజ్’ పాలనను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాయని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
యోగి వ్యాఖ్యలపై అఖిలేశ్ ఫైర్
యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ, ఎన్డీయే కూటమిలోని బీజేపీ తరచుగా గాంధీజీ చెప్పిన మూడు కోతులను గుర్తుచేసుకోవడానికి ప్రధాన కారణం కీలక అంశాల పైనుంచి ప్రజలను డైవర్ట్ చేయడమేనని ఆరోపించారు. “నిజానికి ఆయన (యోగి ఆదిత్యనాథ్)ను కోతుల గుంపు మధ్య కూర్చోబెడితే నువ్వు కానీ, నేను కానీ గుర్తుపట్టలేం” అంటూ అఖిలేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: