విమాన ప్రయాణికులకు డీజీసీఏ (Directorate General of Civil Aviation) శుభవార్త అందించింది. ఇకపై ఎవరైనా టికెట్ బుక్(Flight Ticket) చేసిన తర్వాత 48 గంటల్లోపు రద్దు చేయాలనుకున్నా లేదా ప్రయాణ తేదీని మార్చుకోవాలనుకున్నా ఎటువంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ నిబంధన అన్ని విమానయాన సంస్థలకు వర్తిస్తుంది.
Read Also: AP: హైకోర్టు లో సాక్షి కి షాక్.. పిటిషన్ల కొట్టివేత

క్రెడిట్ కార్డు ద్వారా టికెట్ బుక్ చేసిన ప్రయాణికులకు రిఫండ్ 7 రోజుల్లో అందుతుంది. ట్రావెల్ ఏజెంట్ లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా బుకింగ్ చేసుకున్నవారికి 21 పనిదినాల్లో రిఫండ్ జమ కానుంది. ఈ కొత్త మార్గదర్శకాలు ప్రయాణికుల హక్కులను రక్షించేందుకు, ఎయిర్‌లైన్ కంపెనీల పారదర్శకతను పెంపొందించేందుకు తీసుకున్న కీలక నిర్ణయంగా అధికారులు పేర్కొన్నారు.
అయితే, దేశీయ విమానాల్లో(Flight Ticket) ప్రయాణానికి 5 రోజుల లోపు (5D), అంతర్జాతీయ విమానాల్లో 15 రోజుల లోపు (15D) బుకింగ్‌లకు ఈ ఉచిత రద్దు సౌకర్యం వర్తించదని డీజీసీఏ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ద్వారా ప్రయాణికులు అనుకోని షెడ్యూల్ మార్పుల వల్ల ఇబ్బంది పడకుండా, తమ బుకింగ్‌లను సులభంగా సవరించుకోవచ్చు. విమానయాన రంగంలో వినియోగదారుల సౌకర్యం దృష్ట్యా ఇది మరో ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: