చిన్న విషయాలకు కొందరు రాద్దాంతం చేస్తుంటారు. మరికొందరు అయితే ఎంత పెద్ద తప్పు చేసినా ఇట్టే క్షమించి వేస్తారు. ఇది మనలో ఉండే సంస్కారానికి నిదర్శనం. తప్పులు, పొరపాట్లు ఎవరైనా చేస్తుంటారు. కానీ వాటిని ఓపికతో క్షమించే గుణం ఉండాలి. ఇదే మానవ విలువల్ని పెంచుతుంది. కానీ కొందరు పోకిరీలు ఉంటారు, చిన్న విషయాలకే రాద్దాంతం చేసి, ఎనలేని కీడుకు పాల్పడుతుంటారు. ఇలాంటి సంఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
read also: PAN Card: ఈ పని చేయకపోతే మీ పాన్ రద్దవుతుంది

చట్నీ మీద పడిందని వెంటాడు, హతమార్చారు.. హైదరాబాద్ – నాచారం(Hyd-Nacharam) ప్రాంతంలో అర్థరాత్రి 2గంటలకు సరదాగా కారులో తిరుగుతున్న మహ్మద్ జునైద్ (18), షేక్ నైఫుద్దీన్ (18), మణికంఠ (21), మరో బాలుడు(16)ను, ఎల్బీనగర్ వద్ద మురళికృష్ణ(45) అనే వ్యక్తి లిఫ్ట్ అడిగి వీరి కారులో ఎక్కాడు. అయితే ఎన్టీఆర్ఎస్ఐ ప్రాంతంలో యువకులు అందరూ కలిసి టిఫిన్ చేస్తుండగా, ఒక యువకుడిపై మురళి కృష్ణ చట్నీ పడింది. దీంతో అతడిని కారులో బలవంతంగా ఎక్కించుకుని, నామీదే చట్నీ పోస్తావా అంటూ, మురళికృష్ణను పిడిగుద్దులు గుద్దుతూ నరకం చూపించారు. అంతటితో ఆగక రెండుగంటల పాటు కారులో తిప్పితూ, సిగరెట్లతో కాల్చుతూ, చివరికి కత్తితో మురళి కృష్ణను పొడిచారు.
నిందితుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోకిరీలు వదిలిపెట్టలేదు. చివరికి మురళీకృష్ణ చనిపోయాడా లేదా అని నిర్ధారించుకుని, యువకులు కత్తిని మార్గమధ్యలో పడేసి, మల్లాపూర్ కేఎల్ రెడ్డి నగర్ కారును పార్క్(Hyd-Nacharam) చేసి పారిపోయారు. పోలీసులు నిందితుల సెల్ ఫోన్ల సిగ్నల్ ఆధారంగా అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. పట్టుమని పాతికసంవత్సరాలు లేని ఈ పోకిరీలు తమ ఆనందం కోసం అర్థరాత్రి బయటకు వచ్చి, ఓ వ్యక్తి హత్యకు కారణమయ్యారు. వీరిలో ఓ మైనర్ బాలుడు కూడా ఉండడం విశేషం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: