USA: అమెరికాలో మరో విషాదం చోటుచేసుకుంది. లూయిస్‌విల్లే (Louisville) నగరంలో టేకాఫ్ దశలో ఉన్న ఓ కార్గో విమానం కుప్పకూలి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఈ ప్రమాదాన్ని అధికారికంగా ధృవీకరించింది. వివరాల ప్రకారం, యూపీఎస్ కంపెనీకి చెందిన ఫ్లైట్ నంబర్ 2976 కార్గో విమానం లూయిస్‌విల్లే నుంచి హోనులులుకు బయలుదేరింది. సాయంత్రం 5:15 సమయంలో టేకాఫ్ అవుతుండగా విమానం ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని అదుపు తప్పి కిందపడిపోయింది. మెక్‌డోనెల్ డగ్లస్ ఎండీ-11 మోడల్‌కు చెందిన ఈ విమానం పూర్తిగా కాలిపోయింది.
Read also: UPS Plane Crash : కుప్పకూలిన విమానం.. షాకింగ్ విజువల్స్
USA: ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. విమానం గాల్లో మంటల్లో కూలిపోతున్న వీడియోలు చూసినవారు షాక్‌కు గురవుతున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించాయి. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సాంకేతిక లోపం లేదా ఇంజిన్ వైఫల్యం కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: