శ్రీకాకుళం జిల్లా(Srikakulam) మెలియాపుట్టి మండలం బందపల్లి గ్రామంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రధానోపాధ్యాయురాలు సుజాత వారినే తన కాళ్లు పట్టించుకోవడం పెద్ద వివాదానికి దారితీసింది. సోషల్ మీడియాలో(Social media) వైరల్ అయిన వీడియోలో, సుజాత కుర్చీలో కూర్చుని మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతుండగా, ఇద్దరు విద్యార్థినులు ఆమె ముందే మోకాళ్లపై కూర్చుని కాళ్లు నొక్కుతున్న దృశ్యాలు కనిపించాయి. ఈ వీడియో చూసిన ప్రజలు, తల్లిదండ్రులు, సామాజిక వర్గాలు తీవ్రంగా స్పందించి, ఆ ఉపాధ్యాయురాలిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Also: Karnataka: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

హెచ్‌ఎం సుజాతపై సస్పెన్షన్ ఆదేశాలు
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఉన్నతాధికారులు సంఘటనను తీవ్రంగా పరిగణించి, సంబంధిత ఉపాధ్యాయురాలు(Srikakulam) సుజాతను తక్షణమే సస్పెండ్ చేశారు. సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాథ్ మంగళవారం సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు ఆమెపై సస్పెన్షన్ అమల్లో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థుల గౌరవం, ఆత్మగౌరవాన్ని కించపరిచే ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: