हिन्दी | Epaper
HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Latest News: Postal Department: పోస్టల్ డిపార్ట్‌మెంట్ కొత్త మొబైల్ యాప్‌

Aanusha
Latest News: Postal Department: పోస్టల్ డిపార్ట్‌మెంట్ కొత్త మొబైల్ యాప్‌

భారత తపాల శాఖ (India Post) మారుతున్న కాలానికి అనుగుణంగా తన సేవలను వేగంగా ఆధునికీకరిస్తూ ముందుకు సాగుతోంది. ఒకప్పుడు కేవలం ఉత్తరాల బట్వాడాకు మాత్రమే పరిమితమైన పోస్టాఫీసులు, ఇప్పుడు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పార్శిల్ సేవలు, బిల్లుల చెల్లింపులు వంటి అనేక విభాగాల్లో ప్రజలకు సేవలందిస్తున్నాయి. డిజిటల్ యుగంలో ప్రజలకు మరింత చేరువ కావడమే లక్ష్యంగా భారత తపాల శాఖ తాజాగా “డాక్ సేవ” (Dak Sewa) పేరుతో కొత్త మొబైల్ యాప్‌ను విడుదల చేసింది.

Read Also: Good news: విమాన టికెట్ క్యాన్సలేషన్ ఫ్రీ

‘ఇక పోస్టాఫీస్‌ మీ జేబులోనే’ అనే నినాదంతో తపాల శాఖ ఈ యాప్‌ను తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా పరిచయం చేసింది. ఈ ఒక్క యాప్‌తో పోస్టాఫీసు (Postal Department) అందించే కీలక సేవలను ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా స్మార్ట్‌ ఫోన్ ద్వారానే పొందవచ్చని తెలిపింది. పార్శిల్ ట్రాకింగ్, పోస్టేజ్ ఛార్జీల లెక్కింపు,

ఫిర్యాదుల నమోదు, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు వంటి అనేక సేవలు ఇందులో ఉన్నాయి.డాక్ సేవ యాప్ ద్వారా వినియోగదారులు తమ స్పీడ్‌పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్, మనీ ఆర్డర్ వివరాలను రియల్ టైమ్‌లో ట్రాక్ చేసుకోవచ్చు. జాతీయ, అంతర్జాతీయ పార్శిళ్లకు ఎంత ఖర్చవుతుందో సులభంగా లెక్కించవచ్చు.

Postal Department
Postal Department

నేరుగా యాప్ నుంచే బుక్ చేసుకునే సౌకర్యం

ఇకపై స్పీడ్‌పోస్ట్, పార్శిల్ బుకింగ్ వంటి సేవల కోసం గంటల తరబడి పోస్టాఫీసుల వద్ద క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా, నేరుగా యాప్ నుంచే బుక్ చేసుకునే సౌకర్యం కల్పించారు.అంతేకాకుండా, జీపీఎస్ సహాయంతో తమకు సమీపంలో ఉన్న పోస్టాఫీసుల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

కార్పొరేట్ వినియోగదారుల కోసం ఈ యాప్‌లో ఒక ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ యాప్ ద్వారా తపాల శాఖ (Postal Department) సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది.
 

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870