हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest news: Coimbatore crime: యువతిపై సామూహిక అత్యాచారం.. ఎన్ కౌంటర్ లో నిందితులు

Saritha
Latest news: Coimbatore crime: యువతిపై సామూహిక అత్యాచారం.. ఎన్ కౌంటర్ లో నిందితులు

దేశంలో మహిళకు రక్షణ రోజురోజుకు కరువు అవుతున్నది. ఒంటరిగా కాదు, తమ కుటుంబ సభ్యులతో ఉన్నా వారికి రక్షణ ఉండడం లేదు. ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ తో కారులో ఉండగానే, అత్యాచారానికి(Coimbatore crime) గురైంది. కోయంబత్తూరులో ఓ కాలేజీ విద్యార్థినిని ముగ్గురు వ్యక్తులు కిడ్నిప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యాచార నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. తమిళనాడు(Tamil Nadu) రాష్ట్రం కోయంబత్తూరులో నవంబరు 2న అంతర్జాతీయ విమానాశ్రయం వెనుక బృందావన్ నగర్ ప్రాంతంలో 20 ఏళ్ల పీజీ విద్యార్థినిని ముగ్గురు వ్యక్తులు అపహరించి గ్యాంగ్ రేప్ కు పాల్పడిన విషయం తెలిసింది. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో కోయంబత్తూరు పోలీసులు వెంటనే ఏడు ఏర్పాటు చేసి నిందితులను పట్టుకునేందుకు గాలిపు చేపట్టారు.

Read also: 9వ వారం నామినేషన్స్‌లో ఘర్షణలు – హౌస్‌లో మళ్లీ రచ్చ

Coimbatore crime
Coimbatore crime: యువతిపై సామూహిక అత్యాచారం.. ఎన్ కౌంటర్ లో నిందితులు

బాయ్ ఫ్రెండ్ తో కారులో బయటకు వచ్చిన యువతి

ఆదివారం రాత్రి తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి కారులో బయటకు వచ్చింది యువతి. కోయంబత్తూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఏరియాలో కారును ఆపి ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. అదే టైంలో అక్కడికి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి.. కారును చుట్టుముట్టారు. బాయ్ ఫ్రెండ్ ను ఇష్టం వచ్చినట్లు కొట్టి, యువతిని బలవంతంగా కారులోంచి లాగి మరో ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై ముగ్గురూ అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత బాధితురాలిని రోడ్డుపై వదిలేసి నిందితులు పారిపోయారు. భయాందోళనకు గురైన బాధితురాలు సమీప పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేసింది.

నిందితులపై ఇదివరకే కేసులు

పోలీసులకు సమాచారం అందింది. నిందితులు తుడియాలూరుకు సమీపంలోని తేడియాలూరు ఆలయం సమీపంలో ఉన్నారని వెంటనే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకునేందుకు హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ యత్నించగా ఆయనపై కొడవలితో దాచి చేశారు. ఈ క్రమంలో ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు వారి కాళ్లపై కాల్పులు చేసి, అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ఇప్పటికే హత్య, దోపిడీతో మొత్తం 5 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు గుణ, కురప్పసామి, కార్తీక్ అలియాస్ కాళీశ్వరన్ లుగా పోలీసులు గుర్తించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870