దసరా, దీపావళి సందర్భంగా తెలంగాణలో వేలాది మంది యువతీ యువకులు కొత్త స్మార్ట్ఫోన్లను(Smart Phone) కొనుగోలు చేశారు. కొందరు ఆన్లైన్లో, మరికొందరు ప్రత్యక్షంగా దుకాణాల ద్వారా ఫోన్లు కొనుగోలు చేశారు. అయితే ఇటీవల సైబర్ మోసాలు, ఫోన్ దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఫోన్ వినియోగదారులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also: Kavitha: కొత్త పార్టీపై ఎమ్మెల్సీ కవిత ఏమన్నారంటే

ఐఎంఈఐ నంబర్ నమోదు అత్యవసరం
ఫోన్ పోయినా లేదా దొంగిలించినా, దాన్ని సీఈఐఆర్ (CEIR) పోర్టల్ ద్వారా గుర్తించవచ్చు. అందుకోసం ఫోన్ ఐఎంఈఐ నంబర్‌ను ముందుగానే రికార్డు చేసుకోవాలి. ఈ నంబర్ ఫోన్(Smart Phone) బాక్స్ లేదా రశీదుపై ఉంటుంది. దానిని రాసి భద్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఫోన్ బాక్స్‌ను దాచిపెడితే, రీసేల్ లేదా ఎక్స్ఛేంజ్ సమయంలో అదనంగా 10–20% వరకు లాభం పొందే అవకాశం ఉంటుంది. అలాగే బిల్లు, వారంటీ పత్రాలను సురక్షితంగా ఉంచుకోవాలి. ఫోన్ మరమ్మతుల సమయంలో ఇవి అవసరం అవుతాయి.
యాప్‌ల భద్రతా లాక్ తప్పనిసరి
సైబర్ మోసాలు(Cyber frauds) పెరుగుతున్న నేపథ్యంలో, వ్యక్తిగత వివరాలు లేదా బ్యాంక్ యాప్‌లను రక్షించేందుకు ప్రతి యాప్‌కు వేర్వేరు లాక్‌లు ఏర్పాటు చేయడం మంచిది. పాస్వర్డ్ బలంగా ఉండేలా చూసుకోవాలి. పిన్, ప్యాటర్న్, ఫేస్‌లాక్, బయోమెట్రిక్ లాక్ వంటి భద్రతా ఫీచర్లను ఉపయోగించాలి. ఫోన్లో ముందుగా ఉన్న సెక్యూరిటీ యాప్‌లను సక్రమంగా సెట్ చేస్తే, ఇతరులు దానిని వాడకుండా నిరోధించవచ్చు.
ఫోన్ పోయినప్పుడు ఇలా ఫిర్యాదు చేయండి
ఫోన్ దొంగిలించబడినప్పుడు లేదా పోయినప్పుడు మొదటగా మీసేవ సెంటర్లో ఫిర్యాదు చేయాలి. అక్కడి నుండి రిసిప్ట్ తీసుకుని భద్రపరచాలి. ఆ తరువాత మొబైల్ స్టోర్‌కి వెళ్లి అదే నంబర్‌పై కొత్త సిమ్ తీసుకోవాలి. దీంతో పాత సిమ్ ఆటోమేటిగ్గా బ్లాక్ అవుతుంది. తర్వాత CEIR పోర్టల్ ఓపెన్ చేసి, “Block Stolen/Lost Mobile” అనే ఆప్షన్‌ను ఎంచుకుని, ఫోన్ నంబర్, ఐఎంఈఐ నంబర్, ఇతర అవసరమైన వివరాలు, ఆధార్ ఐడి, కొనుగోలు రశీదు వంటి పత్రాలను అప్లోడ్ చేయాలి. ఫిర్యాదు అందిన 24 గంటల్లో CEIR సిబ్బంది ఆ మొబైల్‌ను బ్లాక్ చేసి పనిచేయకుండా చేస్తారు. దొంగలు కొత్త సిమ్ వేసినా వెంటనే CEIR సిస్టమ్‌కు అలర్ట్ వెళ్తుంది, దాంతో ఫోన్ వినియోగం పూర్తిగా నిలిచిపోతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: