నేతృత్వంలోని భారత మహిళా జట్టు వన్డే ప్రపంచకప్ ఫైనల్లో చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి తొలిసారి కప్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయం దేశవ్యాప్తంగా ఆనందాన్ని నింపగా, సోషల్ మీడియాలో మరో ఆసక్తికర చర్చ మొదలైంది అదే జులన్ గోస్వామి బయోపిక్ ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ గురించి. అనుష్క శర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా, భారత మహిళా క్రికెట్ లెజెండ్ జులన్ గోస్వామి (Jhulan Goswami) జీవితం ఆధారంగా రూపొందుతోంది. కానీ ఈ చిత్రం రెండు సంవత్సరాలుగా ఎలాంటి కొత్త అప్డేట్ లేకుండా నిలిచిపోయింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుందనే ప్రకటనతో పాటు టీజర్‌ను మాత్రమే విడుదల చేశారు.
Read also: National Awards: జాతీయ అవార్డులు రాజీ పడుతున్నాయి: ప్రకాశ్ రాజ్

Harmanpreet Kaur
ఇప్పుడు మహిళల జట్టు సాధించిన ఈ అద్భుత విజయంతో, నెటిజన్లు సోషల్ మీడియాలో ఈ సినిమాను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. జులన్ గోస్వామి స్ఫూర్తిదాయక ప్రయాణం, ప్రస్తుత విజయంతో కలిపి చూసినప్పుడు మరింత ప్రభావవంతంగా ఉంటుందని వారు అంటున్నారు. ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ చిత్రానికి ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. కర్నేష్ శర్మ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, భారత మహిళా క్రికెట్ విజయగాధకు కొత్త ఊపునివ్వగలదని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: