మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి(YS Viveka) హత్య కేసు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ కేసులో రెండో నిందితుడిగా (A2) ఉన్న సునీల్ యాదవ్, హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ(Nampally CBI) ప్రత్యేక కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ఆయన సీబీఐ దర్యాప్తు విధానంపై పలు కీలక అంశాలను ప్రస్తావిస్తూ, ఇంకా అనేక విషయాలు వెలుగులోకి రావాల్సి ఉందని పేర్కొన్నారు.
Read Also: Kavitha: కొత్త పార్టీపై ఎమ్మెల్సీ కవిత ఏమన్నారంటే
సునీల్ యాదవ్ తన పిటిషన్లో మాట్లాడుతూ, “కేసులో అప్రూవర్‌గా ఉన్న దస్తగిరిని కడప జైలులో డాక్టర్ చైతన్యరెడ్డి బెదిరించిన ఘటనపై సీబీఐ దర్యాప్తు ఎందుకు చేయలేదు?” అని ప్రశ్నించారు. అంతేకాకుండా, 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డి(YS Viveka) ఓటమి వెనుక అవినాశ్ రెడ్డి పాత్ర ఉందన్న ఆరోపణలపై విచారణ జరగలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

కేసుతో సంబంధం ఉన్న ఆరుగురు కీలక సాక్షులు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారని, కానీ ఆ మరణాలపై సీబీఐ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని సునీల్ యాదవ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. “ప్రాణహాని ఉందని ముందుగానే ఫిర్యాదు చేసిన కల్లూరు గంగాధర్ రెడ్డికి రక్షణ ఎందుకు ఇవ్వలేకపోయారు?” అని కూడా ఆయన నిలదీశారు.
ఈ కేసులో ఇంకా విచారణకు రావాల్సిన అనేక ప్రముఖులు ఉన్నారని, వారి పాత్రలను సీబీఐ ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని సునీల్ ప్రశ్నించారు. “తాము నిర్దోషులమని చెబుతున్న కొందరు నిందితులు దర్యాప్తుకు సహకరించడంలేదెందుకు? విచారణకు వ్యతిరేకంగా ఎందుకు పోరాడుతున్నారు?” అని ఆయన తన కౌంటర్ పిటిషన్లో ప్రశ్నించారు. సునీల్ యాదవ్ కౌంటర్ పిటిషన్ దాఖలుతో వివేకానందరెడ్డి హత్య కేసు మళ్లీ చర్చనీయాంశంగా మారింది. సీబీఐ వైఖరిపై కొత్త ప్రశ్నలు లేవనెత్తడంతో, ఈ కేసు దిశలో కొత్త మలుపు తిరిగే అవకాశముందని న్యాయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: