Nara Devaansh: నారా దేవాన్ష్: మ్యాచ్ చూస్తూ నారా దేవాన్ష్ సంబరాలు… వీడియో షేర్ చేసిన నారా బ్రహ్మణి భారత మహిళల క్రికెట్ జట్టు ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025లో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఈ విజయ క్షణాలను ప్రత్యక్షంగా చూసిన ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ కుటుంబం ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను నారా లోకేశ్, ఆయన సతీమణి నారా బ్రహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్ (Nara devaansh) ప్రత్యక్షంగా వీక్షించారు. భారత జట్టు విజయం ఖరారైన వెంటనే, స్టాండ్స్‌లో దేవాన్ష్ ఉత్సాహంగా కేరింతలు కొడుతూ, జెండా ఊపుతూ ఆనందం వ్యక్తం చేశాడు.
Read also: AP Liquor Scam: లిక్కర్ స్కామ్ దర్యాప్తులో కీలక పురోగతి
Nara Devaansh: ఈ ప్రత్యేక క్షణాలను నారా బ్రహ్మణి సోషల్ మీడియాలో పంచుకున్నారు. “చరిత్ర సృష్టించిన ఈ ఘట్టాన్ని ప్రత్యక్షంగా చూడటం గర్వంగా ఉంది. లోకేశ్, దేవాన్ష్ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. ఈ రోజు మన జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం” అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు దేవాన్ష్ సంబరాల వీడియోను కూడా జతచేశారు. స్టేడియంలో ఆ సమయంలో ఉన్న ఉత్సాహ వాతావరణం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: