విచారణలో పార్టీ స్క్రిప్ట్ మాత్రమే చదివినట్లు శ్యామల
కర్నూలు(Kurnool) బస్సు ప్రమాదానికి సంబంధించి వైసీపీ(Anchor Shyamala) నాయకురాలు ఆరే శ్యామల పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా, ఆమె పార్టీ నుండి ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే చదివినట్లు, ప్రమాదానికి సంబంధించిన అసలు వివరాలు తనకు తెలియని విషయం పోలీసులకు తెలిపారు.
గత నెల 30న జరిగిన బస్సు ప్రమాదంపై అవాస్తవ ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలతో 27 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో భాగంగా, శ్యామలతో పాటు కారుమూరి వెంకటరెడ్డి, టి. నాగార్జునరెడ్డి తదితరులను కర్నూలు డీఎస్పీ బాబుప్రసాద్ నేతృత్వంలోని బృందం విచారించింది.
Read also: లండన్‌లో కీలక ఒప్పందం – హిందుజా గ్రూప్‌తో రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు

డీఎస్పీ కార్యాలయం వద్ద హడావుడి, ట్రాఫిక్ అంతరాయం
దాదాపు గంట పాదరగా సాగిన విచారణలో, డ్రైవర్ మరియు అతని స్నేహితుడు మద్యం సేవించారని ఆమె(Anchor Shyamala) చెప్పడానికి ఆధారాలు ఏమిటో పోలీసులు అడిగారు. దీనిపై ఆమె సమాధానం చెప్పలేకపోయారు, మరియు పార్టీ ఆదేశాల ప్రకారం మాత్రమే వ్యాఖ్యలు చేశానని వెల్లడించారు. విచారణ తర్వాత, మీడియాతో మాట్లాడిన శ్యామల భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వైసీపీ అధికార ప్రతినిధిగా పది ప్రశ్నలకే సమాధానం ఇచ్చానని, వాటిలో తప్పేమీలేదని, ఎన్ని కేసులు పెట్టినా తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు.ఈ దృష్ట్యా, డీఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘చలో కర్నూలు’ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి సహా అనేక వైకాపా కార్యకర్తలు తరలివచ్చి హడావుడి సృష్టించారు, కొంతకాలం ట్రాఫిక్ అవరోధాలయింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: