తెలంగాణ రాష్ట్రంలోని మీర్జాగూడలో జరిగిన బస్సు ప్రమాదం(Chevella Accident) దేశవ్యాప్తంగా తీవ్ర విచారం కలిగించింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల మృతదేహాలను అధికారులు టోయింగ్ వ్యాన్లో తరలించడం పెద్ద వివాదానికి దారి తీసింది. సామాజిక మాధ్యమాల్లో కూడా ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను ఇలా తరలించడం అనేది బాధిత కుటుంబాల మనోభావాలను దెబ్బతీసే చర్య అని, ప్రభుత్వ వ్యవస్థ మరింత సున్నితంగా, మానవతా దృక్పథంతో వ్యవహరించాలంటూ అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.
Read Also: NH 163: అవి జాతీయ రహదారులు కావు..మృత్యు కోపాలు

ప్రభుత్వ స్పందన కోసం ఎదురుచూపులు
కేటీఆర్(KTR) వ్యాఖ్యల అనంతరం, ప్రభుత్వం ఈ విషయంపై ఏ విధమైన చర్యలు(Chevella Accident) తీసుకుంటుందనే దానిపై అందరి దృష్టి నిలిచింది. ఈ ఘటన భవిష్యత్తులో ఇటువంటి అమానవీయ చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని స్పష్టంగా తెలియజేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: