Indian Women’s Cricket: భారత మహిళా క్రికెట్ జట్టుకు చారిత్రాత్మక విజయంతో కొత్త దశ ప్రారంభమైంది. దక్షిణాఫ్రికాపై విశ్వవిజేతగా నిలిచిన తర్వాత, టీమిండియా మహిళా క్రికెటర్ల బ్రాండ్ విలువ ఆకాశాన్ని తాకింది. అనేక కంపెనీలు ఒప్పందాల కోసం క్యూ కడుతుండగా, ఆటగాళ్ల ఎండార్స్‌మెంట్ ఫీజులు 25 నుంచి 100 శాతం వరకు పెరిగాయి. జెమీమా రోడ్రిగ్స్, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్, షఫాలీ వర్మ వంటి ఆటగాళ్లకు సోషల్ మీడియాలో ఫాలోవర్ల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. బ్రాండ్‌లు కొత్త ఒప్పందాలకే కాకుండా పాత ఒప్పందాలను పునరుద్ధరించేందుకు కూడా ముందుకొస్తున్నాయి.
Read also: Deepti Sharma: దీప్తి శర్మకి శుభాకాంక్షలు చెప్పిన యూపీ డీజీపీ

Indian Women’s Cricket
Indian Women’s Cricket: ప్రత్యేకంగా సెమీఫైనల్‌లో అద్భుత ప్రదర్శనతో నిలిచిన జెమీమా రోడ్రిగ్స్ బ్రాండ్ విలువ 100 శాతం పెరిగింది. ఆమె ఒక్కో ఒప్పందానికి రూ. 75 లక్షల నుంచి రూ. 1.5 కోట్లు వరకు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. స్మృతి మంధాన ఇప్పటికే హెచ్‌యూఎల్, నైక్, హ్యుందాయ్, ఎస్‌బీఐ వంటి 16 బ్రాండ్లకు ప్రచారకర్తగా ఉన్నారు. ఆమె ఒక్కో బ్రాండ్ ఒప్పందం ద్వారా రూ. 2 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. ఈ విజయంతో స్విగ్గీ, పెప్సీ, ప్యూమా వంటి పెద్ద బ్రాండ్లు టీమిండియాకు అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పంచుకున్నాయి. ఈ విజయం భారత మహిళా క్రికెట్‌కు గౌరవం, గుర్తింపు, కొత్త అవకాశాలను తెచ్చిపెట్టింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: