హైదరాబాద్‌లోని ఓస్మానియా యూనివర్సిటీలో(Osmania University) కల్తీ ఆహారంపై విద్యార్థుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఓయూలోని గోదావరి హాస్టల్ వద్ద మంగళవారం ఉదయం విద్యార్థులు తీవ్ర నిరసనకు దిగారు.విద్యార్థుల ప్రకారం, గత కొంతకాలంగా హాస్టల్‌లో అందిస్తున్న ఆహార నాణ్యత దారుణంగా ఉందని, పాడైన కూరలు, నాసిరకం బియ్యం వాడుతున్నారని ఆరోపించారు. విద్యార్థులు ఫుడ్ కాంట్రాక్టర్‌ను ప్రశ్నించగా, “ఆహారం బాలేదంటే ఏం చేసుకుంటారో చేసుకోండి” అనే నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడంతో ఆగ్రహం చెలరేగింది.
Read Also: Constable: ఆన్‌లైన్ గేమ్స్ బారిన పడి కానిస్టేబుల్ ఆత్మహత్య
దాంతో విద్యార్థులు హాస్టల్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. “నాణ్యమైన ఆహారం అందించాలి, కల్తీ ఆహారం సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.విద్యార్థుల నిరసనతో యూనివర్సిటీ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు మాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: