దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పునాది అయిన ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు నేడు ప్రారంభం కానుంది.. మొత్తం 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం ప్రారంభమైంది. ఎన్నికల కమిషన్ (EC) ప్రకారం ఈ సవరణ ప్రక్రియ నవంబర్ 3 నుంచి డిసెంబర్ 4 వరకు కొనసాగుతుంది.
Read Also: Shivraj Singh Chauhan: బీమా సంస్థల తీరుపై కేంద్ర మంత్రి ఆగ్రహం

అనంతరం డిసెంబర్ 9న డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల చేయగా, ఫిబ్రవరి 7న తుది జాబితా (ఫైనల్ లిస్ట్) ప్రకటించనుంది. ఈ సవరణ ప్రక్రియలో దేశవ్యాప్తంగా సుమారు 51 కోట్ల మంది ఓటర్లు భాగం కానున్నారని ఎన్నికల కమిషన్ (EC) తెలిపింది.పారదర్శకంగా సర్ చేపడతామని ఈసీ పేర్కొనగా మరోవైపు ఈ ప్రక్రియను తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: