ఇటీవలి ‘మొంథా’ తుపాను(AP Rain Alert) ప్రభావం తగ్గకముందే, రాష్ట్ర వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచన ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు
Read Also: Breaking News – Working Hours : కార్మికుల పని గంటలు పెంచుతూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వర్షాల సూచన

ఏపీ(Andhra Pradesh) రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ సమాచారం ప్రకారం, మంగళవారం కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముంది.
మిగిలిన జిల్లాల్లో మాత్రం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షం కురిసే సమయంలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉండటంతో ప్రజలు సురక్షిత ప్రదేశాల్లోనే ఉండాలని సూచించింది. అలాగే రైతులు, కూలీలు వర్ష సమయంలో చెట్ల కింద నిలబడకూడదని స్పష్టంగా హెచ్చరించింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: