భారత మహిళా క్రికెట్ జట్టు ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకోవడం దేశవ్యాప్తంగా సంబరాలకు దారితీసింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన ఈ ఘనతను సాధించడంతో అభిమానులు ఉల్లాసంగా మునిగిపోయారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, తూర్పు నుంచి పశ్చిమం వరకు దేశం మొత్తం ఉత్సాహంతో నిండిపోయింది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు “జయహో టీమ్ ఇండియా” అంటూ నినాదాలు గుప్పిస్తున్నారు. ఈ విజయంతో భారత మహిళా క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం రాసినట్టయింది.
Today Rasi Phalalu : రాశి ఫలాలు – 03 నవంబర్ 2025 Horoscope in Telugu
మహిళా జట్టు ప్రదర్శన ఈసారి అద్భుతంగా నిలిచింది. ప్రతి మ్యాచ్‌లో సమర్థవంతమైన వ్యూహం, అచంచలమైన ధైర్యం, ఆటపై అంకితభావం జట్టు విజయానికి కారణమయ్యాయి. ముఖ్యంగా ఫైనల్‌లో చూపిన పట్టుదల, జట్టు స్పూర్తి అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది. ప్రపంచ వేదికపై భారత మహిళలు తమ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు. ఇది కేవలం ఒక క్రీడా విజయం మాత్రమే కాకుండా, మహిళా సాధికారతకు ప్రతీకగా నిలిచిందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దేశవ్యాప్తంగా ఈ విజయాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. వీధుల్లో యువతులు, మహిళలు బృందాలుగా డాన్సులు చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్వీట్లు పంచుకుని, టపాసులు కాల్చుతూ ఉత్సవ వాతావరణం నెలకొంది. సోషల్ మీడియాలో “కంగ్రాట్స్ ఉమెన్స్ ఇన్ బ్లూ”, “ఇండియా ప్రౌడ్ ఆఫ్ యూ” అంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఈ విజయం భారత క్రీడా చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోనుంది. “ఇప్పుడు మహిళలు కూడా ప్రపంచాన్ని గెలవగలరని నిరూపించారు” అని దేశ ప్రజలు గర్వంగా చెబుతున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/