భారత మహిళల క్రికెట్ జట్టు మరో చరిత్రను సృష్టించింది. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్లో దక్షిణాఫ్రికా జట్టును ఓడించి ప్రపంచ విజేతగా నిలిచింది. ఈ చారిత్రక విజయంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) హర్షం వ్యక్తం చేశారు. భారత జట్టు అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించిందని కొనియాడుతూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.
Read Also: Big Breaking: మహిళల వన్డే ప్రపంచకప్ 2025 విజేతగా భారత్
“భారత మహిళల జట్టు ప్రపంచ ఛాంపియన్! ఇది చారిత్రక రాత్రి. మన ‘ఉమెన్ ఇన్ బ్లూ’ అసాధారణమైన పట్టుదల, గుండె ధైర్యంతో ప్రపంచకప్‌ను సాధించింది. అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించారు” అని లోకేశ్ (Nara Lokesh) తన పోస్టులో పేర్కొన్నారు.భారత విజయానికి బాటలు వేసిన కీలక క్రీడాకారిణులను లోకేశ్ ప్రత్యేకంగా అభినందించారు.

జట్టుకు బలమైన పునాది వేసిన షెఫాలీ వర్మకు స్పెషల్ సెల్యూట్
“మెరుపు ఇన్నింగ్స్‌తో 87 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేసిన షెఫాలీ వర్మకు స్పెషల్ సెల్యూట్. అలాగే, ఒత్తిడిలో అద్భుతమైన ఆల్-రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న దీప్తి శర్మ ఛాంపియన్ అని నిరూపించుకుంది” అని ప్రశంసించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రీడాకారిణి శ్రీ చరణిని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. “ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీ చరణి పేరు గుర్తుంచుకోండి. రాబోయే రోజుల్లో ఆమె ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుంది” అని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ విజయం రాబోయే తరానికి గొప్ప స్ఫూర్తినిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. “జై హింద్!” అంటూ తన పోస్టును ముగించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: