కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు మారి సెల్వరాజ్ (Mari Selvaraj) మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. సినిమాల ద్వారా సమాజానికి బలమైన సందేశాలను అందించే మారి సెల్వరాజ్, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ఓ యువ క్రీడాకారిణికి సాయం చేసి ఆదర్శంగా నిలిచారు.తమిళనాడుకు చెందిన కార్తీక అనే యువతి కబడ్డీలో తన ప్రతిభను చాటుకుంటోంది.
Read Also: Zepto: జెప్టో కీలక నిర్ణయం
ఇటీవల బహ్రెయిన్‌లో జరిగిన ఆసియా యూత్ గేమ్స్లో (Asian Youth Games 2025) భారత మహిళల కబడ్డీ జట్టు చరిత్రాత్మక విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత జట్టు ఫైనల్ మ్యాచ్‌లో ఇరాన్‌పై ఘన విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ విజయంలో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన కార్తీక ముఖ్య పాత్ర పోషించింది.
దీంతో ఇప్పటికే భారత జట్టుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రూ. 2 లక్షల నజరానా ప్రకటించారు. కార్తీకపై ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్, రీసెంట్ గా బైసన్ మూవీతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన మారి సెల్వరాజ్ (Mari Selvaraj) కార్తీక ఇంటికి వెళ్లారు.
రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేశారు డైరెక్టర్ మారి సెల్వరాజ్
ఆమెకు అభినందనలు తెలిపి రూ. లక్షల ఆర్థిక సాయం అందించారు. భవిష్యత్ లో కార్తీక మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.కార్తీక పేద కుటుంబంలో జన్మించింది. అమె తల్లిదండ్రులు పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. అయినా అన్ని అడ్డంకులను అధిగమించి అటు చదువులోనూ, ఇటు కబడ్డీలోనూ సత్తా చాటుతోంది కార్తీక.
ఈ నేపథ్యంలో ఆమె పరిస్థితి గురించి తెలుసుకున్న కార్తీకకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేశారు డైరెక్టర్ మారి సెల్వరాజ్. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెటిజన్లు బైసన్ డైరెక్టర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: