ఆంధ్రప్రదేశ్ (AP) లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఒకవైపు పథకాలను అమలు చేస్తూనే, మరోవైపు అభివృద్ధికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తోంది. ప్రజలకు మేలు జరిగే విధంగా పాలనను కొనసాగిస్తూ, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని మళ్లీ ఒకసారి నిరూపించింది. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఉద్యోగుల్లో ఆనందాన్ని నింపింది.
Read Also: AP Weather: ఏపీలో వచ్చే మూడు రోజులు వర్షాలు
తాజాగా ఆంధ్రప్రదేశ్ (AP) ప్రభుత్వం పంచాయతీ రాజ్ శాఖ (Panchayat Raj Department) లో పదోన్నతులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఈ శాఖలో పదోన్నతులకు అవసరమైన అర్హత కాలం రెండు సంవత్సరాలుగా ఉండేది. అయితే, కూటమి ప్రభుత్వం ఈ వ్యవధిని తగ్గిస్తూ రెండేళ్ల అర్హతను ఒక సంవత్సరానికి పరిమితం చేసింది.

ఈ నిర్ణయం వల్ల పెద్ద ఎత్తున పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం కలిగింది.ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈ శాఖలో ఒకేసారి 1,500 మందికి పైగా పంచాయతీ కార్యదర్శులకు పదోన్నతులు లభించనున్నాయి. వీరిలో డిప్యూటీ ఎంపీడీవోలుగా 660 మందికి పదోన్నతి లభించనుండగా.. మిగిలిన వారు పైగ్రేడ్‌లకు పదోన్నతి పొందుతారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: