ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్ర పోలీస్ శాఖలో భారీ స్థాయిలో బదిలీలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 21 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ (IPS Transfer) చేయబడి, వారికి కొత్త బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలతో పోలీస్ వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
Read Also: Jogi Ramesh : జోగి రమేష్ అరెస్ట్
బదిలీల్లో పలు (IPS Transfer) కీలక విభాగాలకు, జిల్లాలకు కొత్త అధికారులను నియమించారు.ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. విశాఖపట్నం సిటీ డిప్యూటీ కమిషనర్‌గా మణికంఠ చందోలు, విజయవాడ సిటీ డిప్యూటీ కమిషనర్‌గా కృష్ణకాంత్ పటేల్ నియమితులయ్యారు.
సైబర్ క్రైమ్, సీఐడీ ఎస్పీగా అధిరాజ్‌సింగ్ రాణా, ఇంటెలిజెన్స్ ఎస్పీగా కె. శ్రీనివాసరావు, ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా ఈ.జి అశోక్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు.వీరితో పాటు మరికొందరికి కూడా కీలక పోస్టింగ్‌లు ఇచ్చారు.

అసిస్టెంట్ ఐజీగా పి.వెంకటరత్నం
విజయవాడ సిటీ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్‌గా షేక్ షరీన్ బేగం, మహిళల భద్రత విభాగం సీఐడీ ఎస్పీగా వి.రత్న, విజయనగరం ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్‌గా రవిశంకర్ రెడ్డి, సీఐడీ ఎస్పీగా ఆర్.గంగాధర్ రావు, ఆర్గనైజేషన్స్ అసిస్టెంట్ ఐజీగా టి.పనసారెడ్డి, ప్లానింగ్ అండ్ కోఆర్డినేషన్ అసిస్టెంట్ ఐజీగా పి.వెంకటరత్నం నియమితులయ్యారు.
డీజీపీ కార్యాలయంలో ట్రైనింగ్ అసిస్టెంట్ ఐజీగా ఎం.సత్తిబాబు, ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్‌లో రూరల్ డిప్యూటీ కమిషనర్‌గా బి.లక్ష్మీనారాయణ, ఈగల్ ఎస్పీగా కేఎమ్ మహేశ్వర రాజు, ఎన్టీఆర్ కమిషనరేట్‌లో సైబర్ క్రైమ్స్ కమిషనర్‌గా కృష్ణ ప్రసన్న బాధ్యతలు చేపట్టనున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా అదనపు ఎస్పీగా పంకజ్ కుమార్ మీనా, శ్రీసత్యసాయి జిల్లా అదనపు ఎస్పీగా సురన అంకిత మహావీర్, జంగారెడ్డి గూడెం ఏఎస్పీగా ఆర్ సుస్మిత, చింతూరు ఏఎస్పీగా హేమంత్ బొడ్డు, పార్వతీపురం ఏఎస్పీగా మనీషా వంగలరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: