మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా తీవ్ర నష్టాన్ని చవిచూసింది. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో పట్టణంలోని అనేక కాలనీలు, గ్రామాలు నీట మునిగిపోయాయి. ప్రజలు ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డారు. అనేక ఇళ్లు కూలిపోగా, మరికొన్ని గోడలు పగిలిపోయాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలు ప్రారంభించింది. విపత్తు నిర్వహణ శాఖ, రెవెన్యూ అధికారులు నష్టపరిహార వివరాలను సేకరిస్తున్నారు.
Latest News: Fee Reimbursement: ఫీజు బకాయిలపై అల్టిమేటం — రేపటిలో నిర్ణయం తీసుకోకపోతే కాలేజీలు
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, పూర్తి స్థాయిలో ధ్వంసమైన ఇళ్లకు రూ.1.30 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, నీటమునిగిన ఇళ్లకు రూ.15 వేల చొప్పున, గుడిసెలు పూర్తిగా దెబ్బతిన్నట్లయితే రూ.8 వేల చొప్పున, పాక్షికంగా నష్టం జరిగిన ఇళ్లకు రూ.6,500 చొప్పున సాయం అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ మొత్తాన్ని బాధితుల ఖాతాల్లో నేరుగా జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటికే అధికార యంత్రాంగం ఇంటింటికీ వెళ్లి నష్టాన్ని అంచనా వేస్తోంది. సర్వే నివేదికను రెండు రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించనున్నారు.

ఇక ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. వరద నీటిని తొలగించేందుకు, చెరువులు, కాలువలను శుభ్రం చేయడానికి మునిసిపల్ సిబ్బంది కృషి చేస్తున్నారు. మునిగిపోయిన ప్రాంతాల్లో తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల పట్ల సానుభూతితో వ్యవహరిస్తోందని అధికారులు తెలిపారు. అయితే, వరదల తీవ్రత వల్ల పునరుద్ధరణ పనులకు కొంత సమయం పట్టే అవకాశం ఉందని వారు చెప్పారు. మొత్తం మీద మొంథా తుఫాన్ వరంగల్ ప్రజలకు భారీ ఆర్థిక, మానసిక దెబ్బను ఇచ్చినట్లు చెప్పవచ్చు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/