హైదరాబాద్ నగరంలో రోజువారీగా వేలాది మంది ప్రయాణికులు ఆధారపడే మెట్రో (Hyderabad Metro) రైళ్ల టైమింగ్స్‌లో కీలక మార్పులు జరిగాయి. హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ తాజాగా ప్రకటించిన కొత్త షెడ్యూల్ ప్రకారం, ఇకపై మెట్రో రైళ్లు ఉదయం 6 గంటలకు ప్రారంభమై రాత్రి 11 గంటల వరకు మాత్రమే నడుస్తాయి. ఈ కొత్త టైమింగ్స్ నవంబర్ 3వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయని అధికారులు వెల్లడించారు.
Read Also: Indiramma illu update : ఇందిరమ్మ ఇండ్ల పథకం నిలిచిపోయిందా? లబ్ధిదారుల ఆందోళనలు
అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి మొదటి రైలు ఉదయం 6 గంటలకు బయలుదేరుతుందని.. అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి రైలు రాత్రి 11 గంటలకు బయలుదేరుతుందని పేర్కొంది. వారంలోని అన్ని రోజులూ ఇదే రకమైన టైమింగ్స్ అమల్లోకి వస్తాయని తెలిపింది.దీనికి సంబంధించి ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ (L&T Hyderabad Metro Rail) ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టింది.
ఈ నిర్ణయం కారణంగా హైదరాబాద్ మెట్రో రైళ్ల (Hyderabad Metro) లో రాత్రి 11 దాటిన తర్వాత ప్రయాణాలు చేసే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఆ సమయంలో బస్సులు చాలా తక్కువ సంఖ్యలో అందుబాటులో ఉండగా.. ఇప్పుడు మెట్రో రైళ్లు కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.

రాత్రి వేళల్లో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య
అయితే రాత్రి వేళల్లో రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతో.. అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటివరకు సోమవారం నుంచి శుక్రవారం వరకు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి మెట్రో ట్రైన్లు రాత్రి 11.45 గంటలకు బయలుదేరేవి.
అక్కడి నుంచి చివరి స్టేషన్‌కు చేరుకునేందుకు దాదాపు 45 నుంచి 50 నిమిషాల వరకు సమయం పట్టేది. దీంతో అర్ధరాత్రి ప్రయాణాలు చేసే ప్రయాణికులకు కూడా వీలు ఉండేది.అయితే మొదట్లో ఇవే రకమైన టైమింగ్స్ ఉండేవి.
ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాత్రి వేళ చివరి రైళ్లను
కానీ ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాత్రి వేళ చివరి రైళ్లను.. ప్రారంభ స్టేషన్ నుంచి 11 గంటలకు బదులు.. 11.45 గంటలకు బయలుదేరేవి. ఇవి కేవలం వీక్ డేస్ అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఉండేవి.
ఇక అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి ఆదివారం రోజున తొలి మెట్రో రైలు ఉదయం 6 గంటలకు బదులు ఉదయం 7 గంటలకు ప్రారంభం అయ్యాయి. అదే సమయంలో సోమవారం రోజున ప్రయోగాత్మకంగా తెల్లవారుజామున 5.30 గంటలకు ప్రారంభం అయ్యేవి. అయితే ఇవన్నీ వర్కౌట్ కాకపోవడం వల్ల మళ్లీ పాత పద్దతిలోనే రైళ్లను నడపనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: