ఎదిగిన తమ పిల్లల్ని ఓ ఇంటివారిగా చేస్తే పెద్ద బాధ్యత తీరిపోతుందని తల్లిదండ్రులు భావిస్తారు. ఇక ఆడపిల్లలు అయితే తమ భారం తీరిపోతుందని ఆడపిల్ల తమకు భారమని, గుండెలపై కుంపటిగా తలంచుతారు. తమ బిడ్డలు కూడా పిల్లాపాపలతో హాయిగా ఉండాలని ప్రతి తల్లిదండ్రి ఆశిస్తారు. అందుకోసం మంచి సంబంధాల కోసం అన్వేస్తుంటారు. పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే తమ ఆడబిడ్డకు పెళ్లి చేసి, అత్తారింటికి పంపాల్సిన ఆ తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయారు. ఆ సమయంలోనే వరుడి తల్లి, వధువు తల్లిల మధ్య ప్రేమ చిగుర్చి, ఇంట్లో నుంచి వారిద్దరు పారిపోయారు.
Read Also: Bira 91: ఉప్పెనై ఎగసిన బీరా 91 కంపెనీ.. నేడు తీవ్ర ఆర్థిక సంక్షోభం..

ప్రేమికుడితో జీవించేందుకు నిర్ణయం
ఉజ్జయిని(Ujjain) జిల్లాలోని బద్ నగర్ ప్రాంతానికి చెందిన 50ఏళ్ల రైతు (వధువు తండ్రి), ఉంటే వాసా గ్రామానికి చెందిన 45 ఏళ్ల మహిళ (వరుడి తల్లి) సుమారు ఎనిమిది రోజుల క్రితం ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. పోలీసుల విచారణలో తేలిన విషయం ఏంటంటే, ఆ ఇద్దరు తమ పిల్లల పెళ్లి ఏర్పాట్లలో భాగంగా తరచుగా కలుసుకోవడం వల్ల ఒకరిపై ఒకరు ఇష్టాన్ని పెంచుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. ప్రేమికుడితో వెళ్లిపోయిన తల్లి మహిళ కుమారుడు తన తల్లి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
దర్యాప్తు చేపట్టిన పోలీసులు,
మహిళను చిక్లీ గ్రామంలో ఆమె ప్రేమికుడితో కలిసి ఉన్నట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తిరిగి రావాలని కోరినా, ఆమె నిరాకరించింది. తాను తన ప్రేమికుడితోనే కలిసి జీవించాలని నిర్ణయించుకున్నట్లు స్పస్టం చేసింది. ఇద్దరూ మేజర్లు కావడం వల్ల ఈ విషయంలో ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేమని పోలీసులు తెలిపారు. దీంతో పెళ్లి రద్దు అయ్యింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: