మీరు ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం గూగుల్ క్రోమ్(Google Chrome) వాడుతున్నట్లయితే, మీకో ముఖ్యమైన హెచ్చరిక. కేంద్ర ప్రభుత్వానికి(Central Govt) చెందిన ఇండియన్ కంప్యూటర్(Computer) ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In), క్రోమ్ డెస్క్‌టాప్ వినియోగదారులకు ఓ హై-రిస్క్(High-risk) హెచ్చరిక జారీ చేసింది. క్రోమ్ బ్రౌజర్ పాత వెర్షన్లలో కొన్ని తీవ్రమైన భద్రతా లోపాలను గుర్తించినట్లు CERT-In తన నివేదికలో స్పష్టం చేసింది. వీటి వల్ల హ్యాకర్లు యూజర్ల అనుమతి లేకుండా వారి కంప్యూటర్ల నుంచి కీలక డేటాను దొంగిలించే ముప్పు ఉందని తెలిపింది.
Read Also: LPG Cylinder: తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర..నేటి నుంచే అమలు

ప్రమాదంలో ఉన్న క్రోమ్ వెర్షన్లు
ఈ భద్రతా లోపాల కారణంగా విండోస్, మ్యాక్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో క్రోమ్ డెస్క్‌టాప్ బ్రౌజర్ వాడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని CERT-In సూచించింది. CERT-In ప్రకారం, ఈ నిర్దిష్ట పాత వెర్షన్లు వాడుతున్న వారికి ప్రమాదం ఎక్కువగా ఉంది:
- లైనక్స్ వెర్షన్లు: 142.0.7444.59 కంటే ముందున్న వెర్షన్లు.
- విండోస్ వెర్షన్లు: 142.0.7444.59/60 కంటే ముందున్న వెర్షన్లు.
- మ్యాక్ వెర్షన్లు: 142.0.7444.60 కంటే ముందున్న వెర్షన్లు.
సైబర్ దాడుల నుంచి వ్యక్తిగత డేటాను కాపాడుకోవాలంటే వినియోగదారులు తక్షణమే తమ బ్రౌజర్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని ఏజెన్సీ గట్టిగా సిఫార్సు చేస్తోంది.
గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసే విధానం
మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను సులభంగా అప్‌డేట్ చేసుకోవడానికి ఈ దశలను అనుసరించండి:
- ముందుగా మీ కంప్యూటర్‌లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి.
- కుడివైపు పైన కనిపించే మూడు చుక్కల (More) మెనూపై క్లిక్ చేయండి.
- ఆ తర్వాత ‘Help’ ఆప్షన్‌లోకి వెళ్లి, ‘About Google Chrome’ ను ఎంచుకోవాలి.
- ఈ పేజీ ఓపెన్ అవ్వగానే, బ్రౌజర్ ఆటోమేటిక్‌గా కొత్త అప్‌డేట్‌ల కోసం చెక్ చేసి, డౌన్‌లోడ్ చేస్తుంది.
- డౌన్‌లోడ్ పూర్తయ్యాక ‘Relaunch’ బటన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. దీంతో మీ బ్రౌజర్ లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ అయి, సురక్షితంగా ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: