
ఎన్నికలు(Tanzania) అంటేనే కొన్నిదేశాల్లో అదొక యుద్ధపరిస్థితులను తలపిస్తుంటాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలదాడులు, పోటీల్లో నెగ్గేందుకు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు, దూషణలు ఇటీవల కాలంలో ఈ పోకడ పెరిగిపోతున్నది. కొన్నిసార్లు భౌతిక దాడులకు కూడా దారితీస్తాయి. హతమార్చేందుకు కూడా వెనుదీయరు. అంతగా ఒకపార్టీపై మరొక పార్టీలు విద్వేషాలతో రగిలి పోతుంటారు. ఇలాంటి హింసకే దారితీసింది టాంజానియా దేశంలో, రక్తపాతానికి 700మందికి పైగా బలి టాంజానియాలో ఎన్నికలు(Elections) హింసకు దారితీశాయి. దీంతో రక్తపాతానికి కారణమైంది. అధ్యక్షురాలు సామియా సులుహు అక్రమాలకు పాల్పడ్డారంటూ ప్రజలు ఆందోళనలు చేశారు. వాటిని అడ్డుకునే క్రమంలో భద్రతా బలగాలు చేసిన ప్రయత్నాలు హింసాత్మకంగా మారాయి. రాజధాని దార్ ఎస్ సలామ్ లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. గత మూడురోజులుగా అల్లలర్లు జరుగుతూనే ఉన్నాయి. వీటిల్లో ఇప్పటివరకు 700మందికి పైగా మరణించారని తెలుస్తోంది.
Read also: పారిశుద్ధ్య కార్మికురాలి పై అత్యాచారం..ఆలస్యంగా వెలుగులోకి

అధ్యక్షురాలికి వ్యతిరేకంగా నిరసనలు
అధ్యక్షురాలు(Tanzania) సామియా ప్రత్యర్థులు పోటీ చేయకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీని ఫలితంగా అధికార సిసిఎం పార్టీపై ఎన్నికల మోసం ఆరోపణలు వచ్చాయి. దీనికి నిరసనగా ప్రజలు రోడ్లమీదకు వచ్చి అల్లర్లు చేశారు. జనసమూహాన్ని చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్, లైవ్ గన్ లను ప్రయోగించారు.
మరోవైపు నిరసనకారులు వాహనాలు, పోలీసు స్టేషన్లు, గ్యాస్ స్టేషన్లకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలోనే వందలమంది ప్రాణాలు పోయాయి. దీని తరువాత టాంజానియాలో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ ఆపేశారు. వీటితో పాటూ దాదాను అన్నిచోట్లా సైన్యాన్ని మోహరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: