అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ముచ్చటగా మూడోసారి అధ్యక్ష పదవిపై తనకున్న మనసును వెల్లడించి, సంచలనం సృష్టించారు. మూడోసారి పోటీ చేస్తే తాను తప్పనిసరిగా గెలుస్తానని, అందుకు తనవద్ద మద్దతు డేటా సమాచారం ఉందని చెప్పారు. అనంతరం మూడోసారి అధ్యక్ష పదవికి అమెరికా చట్టాలు సమ్మతించవని, ఇది మంచి పనికాదని చెడ్డ పని అని తన మాటల్ని సరిచేసుకున్నారు. అయితే ట్రంప్ కు ఏమైనా అయితే అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ అప్పట్లో చేసిన ప్రకటన తీవ్ర కలకలం రేపింది. ఇప్పుడు మరోసారి అధ్యక్షపదవిపై తన మనసులోని మాటను వెల్లడించారు.
Read Also: Food Poison: గద్వాల జిల్లాలో కలకలం – 50 మంది విద్యార్థులకు అస్వస్థత

అమెరికా ఫస్ట్ నినాదంతో ఉన్న జేడీ వాన్స్
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జేడీవాన్స్ అమెరికన్ ఫస్ట్ నినాదంతో ముందుకెళ్తున్న వాన్స్ కు భారత్ కు చెందిన ఆయన భార్య ఉష మతం అడ్డంకిగా మారింది. ఇటీవల ఓ ఈవెంట్ లో వాన్స్ ముందు ఇదే ప్రశ్న ఎదురైంది. భారత సంతతికి చెందిన ఓ మహిళ వాన్స్ పై పలు ప్రశ్నల్ని సంధించింది. ‘మీ పిల్లలకు మీ మతాన్ని వారి తల్లి మతం కంటే ముందు ఉంచవద్దని మీరు ఎలా చెప్తున్నారని వాన్స్ ను అడిగారు. దీనికి ఆయన సమాధానం చెబుతూ ఆది వారాల్లో ఉష తనతో పాటు చర్చికి వస్తుందని, చర్చి తనను ఎలా కదిలించిందో, అలాగే ఆమెను కూడా కదిలిస్తుందని ఆశిస్తున్నట్లు వాన్స్ చెప్పారు. తాను క్రైస్తవ సువార్తను(Christian gospel) నమ్ముతానన్నారు. తన భార్య తన కోసం మతం మారుతుందని జేడీ వాన్స్ చెప్పుకొచ్చారు. అలాగని నేను బలవంతం చేయనని, అది ఆమె ఇష్టమని చెప్పారు.
వాన్స్ వ్యాఖ్యలపై మిశ్రమ స్పందన
జేడీ వాన్స్(J.D. Vance) చేసిన వ్యాఖ్యలపై అమెరికాలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. వాన్స్ వ్యాఖ్యలను రిపబ్లికన్లు, క్రైస్తవ సంప్రదాయవాదులు ప్రశంసలతో ముంచెత్తారు. భారతీయ అమెరికన్లు మాత్రం వాన్స్ పై విరుచుకుపడుతున్నారు. అసలే అమెరికాలో భారతీయ వ్యతిరేకత
పెరుగుతున్న సమయంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాన్స్ రాజకీయం కోసం తన భార్య సొంతమతం, సంస్కృతిని ఆయన తిరస్కరించినట్లు భావిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: