అత్యధిక అక్షరాస్యత రేటుతో దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిన కేరళ (Kerala) రాష్ట్రం, ఇప్పుడు మరో చారిత్రాత్మక ఘనతను సొంతం చేసుకుంది. భారతదేశంలో అత్యంత పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించిన మొదటి రాష్ట్రంగా నిలిచిన కేరళ ఈ సాఫల్యంతో మళ్లీ దేశ దృష్టిని ఆకర్షించింది. ఈ సంతోషకరమైన విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Chief Minister Pinarayi Vijayan) అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ప్రకటించారు.
Read Also: UPI: లావాదేవీలలో సరికొత్త రికార్డు – అక్టోబర్‌లో 20.70 బిలియన్ ట్రాన్సాక్షన్లు
నవంబర్ 1న జరుపుకునే కేరళ పిరవి (Kerala Formation Day) సందర్భంగా నిర్వహించిన అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “కేరళ రాష్ట్రం పేదరిక నిర్మూలనలో దేశానికి మార్గదర్శకంగా నిలిచింది. ఇది మన సమిష్టి కృషికి ప్రతీక” అని పేర్కొన్నారు. ఈ ఘనత కేరళ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించిందని ఆయన అభిప్రాయపడ్డారు.
కేరళ రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచి విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల నుంచీ పట్టణాల వరకూ సమానంగా అభివృద్ధి చెందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింది. “లైఫ్ మిషన్” (LIFE Mission), “కుడుంబశ్రీ” (Kudumbashree) వంటి పథకాలు పేద కుటుంబాల ఆర్థిక, సామాజిక స్థితిని బలోపేతం చేశాయి.
కీలక నిర్ణయాలలో పేదరిక నిర్మూలన ఒకటి
2021లో 2021లో కొత్త మంత్రిత్వ శాఖ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలలో పేదరిక నిర్మూలన ఒకటి అని ముఖ్యమంత్రి తెలిపారు. శాసనసభ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అతి ముఖ్యమైన వాగ్దానాలలో ఒకదాన్ని నెరవేర్చడానికి ఇది నాంది అని..దాన్ని ఈనాటికి పూర్తి చేయగలిగామని చెప్పారు.
అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ ప్రతిపక్షం విజయన్ ప్రకటనలను “శుద్ధ మోసం” అని అభివర్ణించింది. ఇందుకు నిరసనగా సెషన్‌ను బహిష్కరించింది.భారతదేశంలో 100 శాతం అక్షరాస్యత సాధించిన మొట్టమొదటి రాష్ట్రం, మొదటి డిజిటల్ అక్షరాస్యత, పూర్తిగా విద్యుదీకరణ చెందిన రాష్ట్రం అయిన కేరళ (Kerala) లో ప్రభుత్వం.. పేదరికం నుండి తమ ప్రజలను బయటపడేయడానికి అనేక కార్యక్రమాలు చేపట్టింది.
నిర్దిష్ట సూక్ష్మ ప్రణాళికలను రూపొందించామని
1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో రాష్ట్ర ప్రభుత్వం 20,648 కుటుంబాలకు రోజువారీ ఆహారాన్ని అందించింది. వారిలో 2,210 మందికి వేడి భోజనం, 85,721 మందికి అవసరమైన చికిత్స, మందులు…దాంతో పాటూ వేలాది మందికి గృహాలను కూడా నిర్మించి ఇచ్చింది. అంతేకాకుండా, 21,263 మందికి రేషన్ కార్డులు, ఆధార్, పెన్షన్లు వంటి ముఖ్యమైన పత్రాలు మొదటిసారిగా లభించాయని సీఎం విజయన్ తెలిపారు.
4,394 కుటుంబాలకు జీవనోపాధి ప్రాజెక్టుల ద్వారా మద్దతు లభిస్తుందని చెప్పారు. అందరికీ ఒకే విధానానికి బదులుగా, ప్రభుత్వం 64,006 దుర్బల కుటుంబాలను గుర్తించి, ప్రతి ఒక్కరి ప్రత్యేక అవసరాలకు నిర్దిష్ట సూక్ష్మ ప్రణాళికలను రూపొందించామని తెలిపారు. LDF, UDF పరిపాలనల కింద స్థానిక సంస్థల భాగస్వామ్యంతో, రాజకీయ సరిహద్దులను అధిగమించి సమన్వయంతో చేసిన ప్రయత్నాల ఫలితమే ఈ విజయం అని మంత్రి ఎమ్బీ రాజేష్ తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: