పంజాబ్‌లో మరోసారి దారుణ ఘటన చోటుచేసుకుంది. దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఓ జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడు తన స్నేహితుల చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. లూథియానా జిల్లా జాగ్రావ్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనాన్ని రేపింది. పాత విభేదాలు, వ్యక్తిగత గొడవలే ఈ ఘోర హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.
Read Also: Shivam Record: దూబే, బుమ్రా అన్‌బీటెన్ రికార్డులకు ముగింపు
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయర్ అయిన తేజ్‌పాల్ సింగ్ (Tejpal Singh) (26) తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ ఫ్యాక్టరీకి నడుచుకుంటూ వెళుతున్నాడు. ఈ క్రమంలో వారి మధ్య ఓ పాత గొడవకు సంబంధించి వాగ్వాదం మొదలైంది.

నిందితుల కోసం గాలింపు చేపట్టారు
కొద్దిసేపటికే అది తీవ్ర ఘర్షణకు దారితీసింది.మాటామాటా పెరగడంతో, వారితో కలిసిన మరో గుర్తుతెలియని వ్యక్తి తన వద్ద ఉన్న తుపాకీ తీసి తేజ్‌పాల్ (Tejpal Singh) ఛాతీపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) కార్యాలయానికి సమీపంలోనే జరగడం గమనార్హం.రక్తపు మడుగులో పడి ఉన్న తేజ్‌పాల్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
అయితే, ఆసుపత్రికి చేరుకునేలోపే అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అధికారులు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: